‘ఎవడు’ సక్సెస్ టూర్ విశేషాలు

By Bojja Kumar

హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, సక్సెస్ ఫుల్ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో, సూపర్ హిట్ చిత్రాల ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించిన ఎవడు చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలై భారీ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. విడుదలైన అన్ని సెంటర్స్‌లో భారీ ఓపెనింగ్స్ సాధించింది.

Yevadu-Success-Tour

ఈ శుభ సందర్భంగా ఎవడు చిత్ర సక్సెన్‌ను అభిమానుల సమక్షంలో సెలబ్రేట్ చేసుకోనున్నారు. ఈ మేరకు ఎవడు విజయయాత్ర తిరుపతి నుండి ప్రారంభించేందకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎవడు సినిమా యూనిట్ అంతా ఈ విజయయాత్రలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.

దిల్ రాజు మాట్లాడుతూ....'మా బేనర్లో నిర్మించిన 16వ సినిమా ఇది. సినిమా విడుదలైన తర్వాత తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకోవడం ఆనవాయితీ. ఈ సంక్రాంతి కానుకగా తెలుగు ప్రేక్షకుల ముందుకు ఎవడు సినిమాతో మీ ముందుకు వచ్చాం. ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సందర్భంగా ఎవడు సక్సెస్‌ను అభిమానుల సమక్షంలోనే జరుపుకోబోతున్నాం. ఈ సక్సెస్ టూర్ తిరుపతి నుండి ప్రారంభిస్తున్నాం. శుక్రవారం నుండి అంటే 17వ తేదీన తిరుపతి నుంచి ఎవడు విజయయాత్ర ప్రారంభమౌతుంది. నెల్లూరు, ఒంగోలు, గుంటూరులో పూర్తి చేసుకుంటుంది.

ఆ తర్వాతి రోజు అంటే శనివారం 18వ తేదీన విజయవాడ, భీమవరం, పాలకొల్లు, రాజమండ్రిలో విజయయాత్ర పూర్తి చేస్తాం. రామ్ చరణ్ కెరీర్లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా రికార్డులు సాధించింది. కర్నాటక, తమిళనాడులోనూ అద్భుతమైన ఓపెనింగ్స్ సాధించి తెలుగు సినిమా స్థాయిని పెంచిన చిత్రంగా ఎవడు నిలిచింది. శ్రీ వెంకటేశ్వరుని ఆశీస్సులుండం వల్లే మాకు ఇంతటి ఘన విజయం దక్కింది అందుకే తిరుపతి నుండి ఈ సక్సెస్ టూర్ ప్రారంభిస్తున్నాం అన్నారు దిల్ రాజు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X