ఎవడు: దిల్‌ రాజు డాన్స్, వంశీ దండాలు (ఫోటోలు)

By Bojja Kumar

హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన 'ఎవడు' చిత్రం భారీ విజయం సాధించిన నేపథ్యంలో చిత్ర యూనిట్ సభ్యులు విజయయాత్ర ప్రారంభించారు. విజయోత్సవ యాత్ర ప్రారంభించడానికి ముందు నిర్మాతలు దిల్ రాజు, లక్ష్మణ్‌లు తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఇద్దరూ క్షవరం చేయించుకుని ఏడుకొండల వాడికి తలనీలాలు సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. అనంతరం విజయోత్సవ యాత్ర నిర్వహించారు.

అనంతరం తిరుపతి కృష్ణ తేజ థియేటర్, నెల్లూరు ఎస్ 2 థియేటర్, ఒంగోలు గోరంట్ల కాంప్లెక్స్ తదితర ప్రాంతాల్లో మెగా అభిమానులను కలుసుకుని కేక్ కట్ చేసి 'ఎవడు' విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సినిమాకు అఖండ విజయం అదించిన అభిమానులకు దర్శకుడు వంశీ పైడిపల్లి చేతులెత్తి నమస్కారం చేసారు. ఈ సందర్భంగా దిల్ రాజు ఎవడు సినిమాలోని సాంగుకు స్టెప్పులేసారు.

'ఎవడు' చిత్ర యూనిట్ రాకను పురస్కరించుకుని ఫ్యాన్స్ భారీ కటౌట్లు ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. డప్పు వాయిద్యాలు, బాణా సంచాతో సందడి సృష్టించారు. అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో....

దిల్ రాజు

దిల్ రాజు


దిల్ రాజు మాట్లాడుతూ....‘మా బేనర్లో నిర్మించిన 16వ సినిమా ఇది. సినిమా విడుదలైన తర్వాత తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకోవడం ఆనవాయితీ. ఈ సంక్రాంతి కానుకగా తెలుగు ప్రేక్షకుల ముందుకు ఎవడు సినిమాతో మీ ముందుకు వచ్చాం. ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమా సూపర్ హిట్ అయింది' అన్నారు.

టూర్ విశేషాలు

టూర్ విశేషాలు


శుక్రవారం తిరుపతి నుండి ప్రారంభమైన ఎవడు సక్సెస్ టూర్ నెల్లూరు, ఒంగోలు గుండా సాగింది.

నెక్ట్స్ ఎక్కడంటే...

నెక్ట్స్ ఎక్కడంటే...


శనివారం 18వ తేదీన విజయవాడ, భీమవరం, పాలకొల్లు, రాజమండ్రిలో విజయయాత్ర సాగనుంది.

వెంకటేశ్వరుని ఆశీస్సులు

వెంకటేశ్వరుని ఆశీస్సులు


ర్నాటక, తమిళనాడులోనూ అద్భుతమైన ఓపెనింగ్స్ సాధించి తెలుగు సినిమా స్థాయిని పెంచిన చిత్రంగా ఎవడు నిలిచింది. శ్రీ వెంకటేశ్వరుని ఆశీస్సులుండం వల్లే మాకు ఇంతటి ఘన విజయం దక్కింది అందుకే తిరుపతి నుండి ఈ సక్సెస్ టూర్ ప్రారంభిస్తున్నాం అన్నారు దిల్ రాజు.

ఎవడు

ఎవడు


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, సక్సెస్ ఫుల్ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో, సూపర్ హిట్ చిత్రాల ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించిన ఎవడు చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలై భారీ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. విడుదలైన అన్ని సెంటర్స్‌లో భారీ ఓపెనింగ్స్ సాధించింది.

4 రోజుల్లో 25 కోట్ల కలెక్షన్

4 రోజుల్లో 25 కోట్ల కలెక్షన్


రామ్ చరణ్ నటించిన ‘ఎవడు' చిత్రం ఆదివారం విడుదలై కలెక్షన్ల పరంగా దుమ్ము రేపుతోంది. తొలి 4 రోజుల్లో ఈచిత్రం ఏపీలో రూ. 21 కోట్ల పైచిలుకు వసూలు చేసింది. ఇండియా వ్యాప్తంగా టోటల్ కలెక్షన్స్ 25 కోట్లు రాబట్టింది.

ఎల్బీ శ్రీరామ్

ఎల్బీ శ్రీరామ్


''క్లిష్టతరమైన కథ ఇది. కానీ దర్శకుడు అందరికీ అర్థమయ్యేలా తీర్చిదిద్దిన విధానం బాగుంది. నా పాత్రకు వస్తున్న స్పందన మరింత ఆనందాన్నిస్తుంది'' అని ఎల్బీ శ్రీరామ్‌ చెప్పారు.

వంశీ పైడిపల్లి

వంశీ పైడిపల్లి


దర్శకుడు వంశీపైడిపల్లి మాట్లాడుతూ ''ఇది నా మూడో సినిమా. పూర్తి సంతృప్తిని ఇచ్చిన సినిమా కూడా ఇదే. రామ్‌చరణ్‌ని దృష్టిలో పెట్టుకొని రాసుకొన్న కథ ఇది. అల్లు అర్జున్‌ లేకపోతే ఈ సినిమా ముందుకు వెళ్లేది కాదు. అబ్బూరి రవి అందించిన మాటలు, దేవిశ్రీ సంగీతం.. ఇలా ఒక్కటి కాదు, ప్రతీ విభాగం నాకు తోడ్పడింది. కష్టకాలంలో నాకు తోడుగా నిలిచినవాళ్లందరికీ నా కృతజ్ఞతలు'' అన్నారు.

లోటు తీర్చింది

లోటు తీర్చింది


దిల్ రాజు నిర్మించిన చిత్రం 'ఎవడు'. రామ్‌చరణ్‌ కథానాయకుడు. ఇటీవలే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. 'ఎవడు' చిత్రం సక్సెస్ మీట్ రీసెంట్ గా జరిగింది. దిల్ రాజు మాట్లాడుతూ... ''మీరు వాణిజ్య చిత్రాలు తీయలేరా?' అని నాకు బాగా పరిచయం ఉన్న హీరోలు నన్ను ఆట పట్టించేవారు. నిజంగానే.. మా సంస్థలో పదహారు సినిమాలొచ్చాయి. అందులో కమర్షియల్‌ అంశాలతో సినిమా తీయలేదు. ఆ లోటు 'ఎవడు' తీర్చింది'' అంటున్నారు దిల్‌రాజు.

ఆ బాధ మరిచిపోయాం

ఆ బాధ మరిచిపోయాం


''సినిమా పూర్తయి ఆరు నెలలయ్యింది. కానీ విడుదల చేయలేకపోయాం. ఏ నిమిషం ఏం జరుగుతుందో అని ప్రతీ నిమిషం ఆందోళనే. కానీ 'ఎవడు' ఫలితం మాత్రం ఆ కష్టాన్ని మరిపించింది. ఇది దర్శకుడి సినిమా అని ముందు నుంచీ చెబుతున్నా. ఆమాటే నిజమైంది''అన్నారు దిల్ రాజు.

విచ్చేస్తున్న ఎవడు యూనిట్

విచ్చేస్తున్న ఎవడు యూనిట్


కార్లో థియేటర్‌కు విచ్చేస్తున్న ఎవడు యూనిట్ సభ్యులను ఇక్కడ చూడొచ్చు.

ఫ్యాన్స్

ఫ్యాన్స్


భారీ కటౌట్లు ఏర్పాటు చేసిన అభిమానులు. వాళ్ల మొహాల్లో సంతోషాన్ని ఇక్కడ చూడొచ్చు.

కేక పుట్టించారు

కేక పుట్టించారు

ఎవడు విజయోత్సవ సంబరాల్లో పలువురు అభిమానులు విజిల్స్, కేరింతలతో కేక పుట్టించారు.

అజయ్

అజయ్


ఎవడు సినిమాలో నటించిన నటుడు అజయ్ రామ్ చరణ్ అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతున్న దృశ్యం

బాణాసంచా

బాణాసంచా


ఎవడు మూవీ విజయోత్సవాల్లో భాగంగా థియేటర్ల వద్ద బాణా సంచా కాల్చారు.

మీడియా సమావేశం

మీడియా సమావేశం


తిరుపతిలోని ఓ హోటల్‌లో చిత్ర యూనిట్ సభ్యులు మీడియా సమావేశం ఏర్పాటు చేసారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X