»   » యోగా చేయడం వల్లే బ్రతికాను: జగపతి బాబు

యోగా చేయడం వల్లే బ్రతికాను: జగపతి బాబు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యోగా.. గురించి భగవద్గీతలో అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్పాడు. అంతకుముందు వేదాల్లోనూ ఉంది. దీన్నే పతంజలి మరింత పవర్‌ఫుల్‌గా చెప్పాడు. ఆ తరువాత బుద్ధుడు, స్వామి వివేకానంద కూడా అదే చెప్పారు. ఆధునిక జీవన శైలి తెచ్చే అనర్థాల నుంచి తెరిపిన పడేందుకు మేలైన, సులువైన మందు యోగా.

ప్రముఖ నటుడు జగపతి బాబు కూడా యోగాను మించినది లేదంటున్నాడు. హైదరాబాద్ లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన యోగా గురించి మాట్లాడారు. యోగా నేర్చుకోవడం వల్ల అనారోగ్యం బారిన పడకుండా ఆరోగ్యంగా జీవించవచ్చన్నారు. గతంలో షూటింగులో తనకు ప్రమాదం జరిగిందని, అపుడు శ్వాసమీద దృష్టి పెట్టి యోగా చేయడం వల్లనే ప్రాణాపాయ స్థితి నుండి బయట పడ్డానని జగపతి బాబు తెలిపారు.

Yoga saved my Life: Jagapathi Babu

యోగా సాధన వల్ల మన శరీరంలోని నిరోటిన్ ధాతువు వృద్ధి చెంది మెదడులోని న్యూరో ట్రాన్స్‌మిషన్‌ను క్రమబద్దీకరిస్తుంది. ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు కూడా ధ్రువీకరించారు. యోగా వల్ల శరీరంలో సమతుల్యత కలుగుతుంది. క్యాన్సర్‌లాంటి పెద్ద రోగాలకు యోగాలోని ప్రాణయామ, యోగనిద్ర, మెడిటేషన్ ద్వారా చెక్ పెట్టొచ్చు. యోగా ద్వారా ప్రశాంతతే కాక ఆనందం పొందవచ్చు.

హెల్తీగా ఉన్నప్పుడే యోగా ప్రారంభిస్తే మంచి ఫలితం ఉంటుంది. మెడిసిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమో కానీ యోగా వల్ల ఎలాంటి నష్టమూ లేదు. ఎండోక్రెనాల్ గ్రంథి పనితీరు సరిగా ఉండాలంటే ఏ వైద్యం పనికిరాదు. కేవలం యోగా వల్లనే సాధ్యమవుతుంది. ఒత్తిడి తగ్గాలన్నా, వెన్నెముక దృఢంగా మారాలన్నా యోగా తప్పనిసరి. రోగనిరోధక శక్తి స్థాయి పెరగాలనుకుంటే యోగాని కష్టపడి కాకుండా ఇష్టపడి చేయాలి.

English summary
actor Jagapathi Babu appealed to the audiences to practice Yoga for the good health and mental peace. He also revealed that Yoga saved his life.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu