హీరోయిన్ ను అంత దారుణంగా కొట్టాల్సిన పనేంటి?
ముంబై: ఏదో ఒక కారణం లేకుండా ఒక మనిషినీ అదీ ఓ హీరోయిన్ ని రోడ్డుపై కారు లోంచి లాగి కొట్టరు కదా అంటోంది బాలీవుడ్. ఏదో ఒక కారణంతోనే అది జరిగి ఉంటుంది అని అంతటా విమర్శలు వినిపిస్తున్నాయి. సానుభూతి పొంగుతుంది అనుకుంటే రివర్స్ లో అందరూ తలో రకంగా కామెట్స్ చేస్తున్నారు. ఇదంతా ఎవరి గురించి అంటారా...నిన్న ముంబైలోని రోడ్డుపై ఓ బిజినెస్ మ్యాన్ చేతిలో దెబ్బలు తిన్న యోగితా దండేకర్ గురించి. గతంలోఈ మరాఠీ నటి నగ్నంగా తన శరీరంపై మూడు రంగుల పేయింట్ వేయించుకుని తాను అన్నా హజారే ఉద్యమానికి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించుకున్న సంగతి తెలిసిందే.
పూర్తి వివరాల్లోకి వెళితే.. ట్రాఫిక్ సిగ్నల్, జరా సంభాల్ కె తదితర చిత్రాల్లో నటించిన నటి యోగితా దండేకర్‌ను ముంబైలోని జుహు ప్రంతంలో వ్యాపారవేత్త హన్సరాజ్ సురాన, ఆయన కారు డ్రైవర్ కృష్ణ కుమార్ వైద్యనాథ్‌లు వేధించినట్టు పోలీసులు కేసు నమోదు చేశారు. తనను కారు నుంచి బయటకు లాగి పదేపదే చెంపపై కొట్టారని యోగిత పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మొత్తం 10 నిమిషాల పాటు మాటలతో, చేతలతో తనను వేధిస్తున్నా చుట్టూ ఉన్నవారిలో ఎవరూ తనకు సాయం చేసేందుకు ముందుకు రాలేదని ఆమె ఆరోపించారు.

నిందితులపై ఐపీసీ సెక్షన్ 354 కింద కేసునమోదు చేసి రిమాండ్‌కు పంపామని పోలీసులు తెలిపారు. ఈ సంఘటన మంగళవారం సాయంత్రం ఏడున్నర గంటలకు జరిగింది. హన్సరాజ్ సురన మల్టీనేషనల్ కంపెనీ డైరెక్టర్. తాను వారి నుండి తప్పించుకొని వచ్చి ఫిర్యాదు చేస్తున్నట్లు నటి పోలీసులకు చెప్పింది.
ఆమె ఫిర్యాదుతో సురన, వైద్యనాథ్‌లను పోలీసులు అరెస్టు చేశారు. వ్యాపారవేత్త హన్సరాజ్ సురన, అతని డ్రైవర్ పైన సెక్షన్ 354(వేధింపులు) తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వారిని గురువారం వరకు పోలీసు కస్టడీలో ఉంచారు. అనంతరం వారికి బెయిల్ వచ్చింది. దీని పైన వ్యాఖ్యానించేందుకు సురన అందుబాటులో లేరని వార్తలు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











