'ఫాధర్స్ డే' అంబాసిడర్‌గా కూడా మహేష్ బాబునే ...
మహేష్ బాబు అనేక ఉత్పత్తిలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటున్న సంగతి తెలిసిందే.ఆయన కనిపిస్తే చాలా ఆ ఉత్పత్తలు మార్కెట్ పెరుగుతూండటంతో ఎక్కడెక్కడి వారు ఆయన్ని సంప్రదిస్తువ్నారు.ఇక ప్రస్తుత విషయానికి వస్తే..ఈ మధ్యనే ఫాదర్స్ డే ప్రపంచమంతటా జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ ఫాధర్స్ డే సందర్భంగా మహేష్ ని,అతని కుమారుడు గౌతమ్ ని కలిపిన ఫోటోను యు అండ్ ఐ మ్యాగజైన్ ప్రచురించింది.
వారి కవర్ పేజ్ మీద ప్రచురించిన ఈ ఫోటోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ పత్రిక ఫాధర్స్ డే స్పెషల్ సంచికను ప్రచురిస్తూ ఈ ఫోటోను వేసింది.మహేష్ బాబు ఓ తండ్రిగా గ్రేటెస్ట్ రోల్ ని పోషిస్తున్నాడంటూ రాసుకొచ్చింది.అంటే ఫాధర్స్ డే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళటానికి కూడా మహేష్ నే అంబాసిడర్ గా ఎంచుకున్నట్లే కదా. ప్రస్తుతం మహేష్ దూకుడు చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు.శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సమంత హీరోయిన్ గా చేస్తోంది.


Click it and Unblock the Notifications











