»   »  స్టార్ హీరోయిన్..ఇంత చెత్తగా తయారై పంక్షన్ కు వచ్చిందేంటి?...అందరూ షాక్ (ఫొటోలు)

స్టార్ హీరోయిన్..ఇంత చెత్తగా తయారై పంక్షన్ కు వచ్చిందేంటి?...అందరూ షాక్ (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: సాధారణంగా స్టార్స్ ఏదైనా పంక్షన్ కు వెళ్ళేటప్పుడు స్పెషల్ గా తయారై వెళ్తూంటారు. ముఖ్యంగా అవార్డ్ పంక్షన్ వంటివాటికి మరింత జాగ్రత్తలు తీసుకుంటారు. ఎందుకంటే మీడియా దృష్టి తమమీదే ఉంటుందనీ వాళ్లకు తెలుసు. అయితే ఒక్కోసారి వారు ఎంతో గొప్పగా ఉంటుందని వేసుకున్న మేకప్, డ్రస్ చెత్తగా ఉండి అభిమానులకు షాక్ ఇస్తాయి. హాట్ టాపిక్ గా మారుతాయి. ఇప్పుడు అలాంటి పరిస్దితే దీపికా పదుకోనికు ఏర్పడింది.

దీపికా పదుకొనే.. ప్రస్తుతం ఇండియాలో హైయెస్ట్ పెయిడ్ హీరోయిన్. గత కొన్నేళ్లుగా ప్రతి ఏడాదీ కనీసం ఒక్క బ్లాక్‌బస్టర్ అయినా ఖాతాలో వేసుకుంటూ వస్తున్న దీపిక.. ప్రస్తుతం హాలీవుడ్ మూవీ 'ట్రిపులెక్స్' లో సైతం నటిస్తోంది. మరోవైపు బాలీవుడ్లోనూ ఆమె కోసం మాంచి ఆఫర్లు వెయిట్ చేస్తున్నాయి.

ఈ నేపధ్యంలో ఆమెను ముంబైలోని జెయింట్ అవార్డ్ లకు ఆహ్వానించారు. అక్కడ కు ఆమె ఎంతో అందంగా తయారై వస్తుందనుకుంటే జనాలను భయపెట్టేలా రెడీ అయ్యి వచ్చింది. ఆమె అవుట్ ఫిట్ చూసి అందరూ నోరు వెళ్లపెట్టారు. మీరూ ఇక్కడ ఆ ఫొటోలు చూస్తే అదే మాట అంటారు.

స్లైడ్ షోలో దీపిక చెత్తగా తయారై వచ్చిన ఫొటోలు క్రింద చూడండి..

 ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు

ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు

బాలీవుడ్ లో ఇప్పుడు నెంబర్ వన్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న వారిలో దీపికా పదుకొనే ఒకరు. వాస్తవానికి కన్నడ భామ అయిన దీపికా బాలీవుడ్ లో సినిమా చాన్సులు దక్కించుకుంది. దాంతో ఆమెకు ఇలాంటి అవార్డ్ ల పంక్షన్స్ లకు గెస్ట్ గా పాల్గొనమని పిలుస్తూనే ఉంటారు. అయితే అందుకు తగ్గట్లుగానే ఆమె ఎప్పుడూ చాలా హాట్ గా అందంగా తయారై వెళ్తూంటుంది. అయితే ఈ సారి ఫ్యాన్స్ ని చాలా డిజప్పాయింట్ చేసింది.

 అనుకున్నది ఒకటి అయ్యిందొక్కటి

అనుకున్నది ఒకటి అయ్యిందొక్కటి

అనుకున్నదొక్కటి, అయ్యిందొక్కటి బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్టా అన్నట్లుగా దీపిక ఈ అవుట్ ఫిట్ ని చాలా మోడ్రన్ గా ఫీలైందిట. అందుకే చాలా మోజుపడి దీన్ని వేసుకుందింట. ముఖ్యంగా ఈ మధ్యన హాలీవుడ్ కు వెళ్లిన ఆమె అక్కడ డ్రస్ లును చూసి ముచ్చపడి, వాటిలో తనను తాను చూసుకోవాలని ఆశించింది. దాని ఫలితమే ఇంత చెత్త డ్రస్ అని తేలింది.

 ఇంటర్నేషనల్ స్టార్

ఇంటర్నేషనల్ స్టార్

షారూఖ్ ఖాన్ తో నటించిన ఓంశాంతి ఓం, చెన్నై ఎక్స్ ప్రెస్, హ్యాపీ న్యూఇయర్ చిత్రాలతో ఎక్కడేని ఇమేజ్ వచ్చంది. అందే కాదు దీపికా ఇప్పటికే 'త్రిఫుల్‌ ఎక్స్‌' హాలీవుడ్‌ చిత్రంలో విన్‌ డిజీల్‌ సరసన నటిస్తున్న సంగతి విదితమే. దాంతో ఆమె క్రేజ్ ఇంటర్నేషనల్ స్దాయికి ఎదిగిపోయింది. ఆమె గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుతోంది. ఇప్పుడు దీపికా అంటే ఇంటర్నేషనల్ ఫిగర్.

కానీ ఏం చేస్తుంది ఫీలవుతోంది

కానీ ఏం చేస్తుంది ఫీలవుతోంది

ఐతే సినిమాల్లో ఎంత సాధించినా.. క్రీడాకారిణిగా ఎదగలేకపోయానని ఫీలవుతోంది దీపిక. తండ్రి ప్రకాష్ పదుకొనే స్ఫూర్తితో చిన్నపుడే బ్యాడ్మింటన్ రాకెట్ పట్టిన దీపిక.. ఆ క్రీడలో కొంత వరకు ఎదిగింది. కానీ ఆ తర్వాత మోడలింగ్ బాట పట్టి.. చివరికి సినిమాల్లో సెటిటైపోయింది. ఐతే బ్యాడ్మింటన్లోనే కొనసాగి ఉంటే ఈ రోజు తాను ఒలింపిక్స్‌లో పోటీ పడుతూ ఉండేదాన్నేమో అంటోంది దీపిక.

 ఈ ఫీల్డ్ లో లేకపోతేనా..ఇంచక్కా

ఈ ఫీల్డ్ లో లేకపోతేనా..ఇంచక్కా

‘‘నేను సినీ రంగంలో ప్రవేశించకపోతే కచ్చితంగా ఇప్పుడు జరుగుతున్న ఒలింపిక్స్‌లో పోటీ పడుతూ ఉండేదాన్ని. సినిమా రంగంలో ఆస్కార్‌ అవార్డు ఎంత గొప్పదో.. ఒలింపిక్స్‌లో పతకం సాధించడం కూడా అంతే గొప్ప విషయం. నేను నా చిన్నప్పటి నుంచి టీనేజ్‌ వరకు బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణిని. జాతీయస్థాయిలోనూ ఆడాను. ఆటలో ఇంకా ఉన్నత స్థాయికి చేరాలనుకున్నా. కానీ అనుకోకుండా గ్లామర్ ఫీల్డ‌్‌లోకి వచ్చేశా. ఐతే ఆట ఇచ్చే సంతృప్తే వేరు. క్రీడల్లో కొనసాగి ఉంటే రియోలో ఆడుతూ ఉండేదాన్నేమో. పతకం కూడా సాధించేదాన్నేమో. నా సంగతెలా ఉన్నా.. రియో ఒలింపిక్స్‌లో పోటీ పడుతున్న మన అథ్లెట్లు పతకాలు సాధించాలని కోరుకుంటున్నా'' అని దీపిక చెప్పింది.

గేట్లు తెరిచేసింది

గేట్లు తెరిచేసింది

ఇప్పుడు దీపిక 'త్రిబుల్ ఎక్స్ ది రిటర్న్ ఆఫ్ గ్జాండర్ కేజ్' అనే హాలీవుడ్ మూవీ పూర్తిఅయిన సందర్భంగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చేస్తోంది. ఇందులోభాగంగా ఆమెని హాలీవుడ్ మ్యాగజైన్ వానిటీ ఫెయిర్ స్పెషల్‌గా ఇంటర్వ్యూ చేసింది..ఆ సమయంలో కారులోంచి దిగిన ఫోటో చూస్తే హాటీవుడ్ గాలి బాగా సోకినట్లు కనిపిస్తుంది. దీపికా క్లీవేజ్ షోను కవర్ చేస్తూ ఈ ఫోటోని కవర్ పేజీల్లో అచ్చేసుకుంది.

 నేనేమీ మారలేదు

నేనేమీ మారలేదు

ప్రియాంక చోప్రా.. అమెరికన్‌ టీవీ షో 'క్వాంటికో'లో నటించిన తర్వాత ప్రస్తుతం 'బేవాచ్‌' అనే హాలీవుడ్‌ చిత్రంలో నటిస్తోంది. దీంతో మీరు హాలీవుడ్‌ నటిగా మారిపోయారా? అని అడిగితే తనని అంతర్జాతీయ నటిగా గుర్తిస్తే.. సంతోషిస్తానని చెప్పింది. ఇప్పుడు అదే విషయాన్ని బాలీవుడ్‌ సినిమా నుంచి హాలీవుడ్‌లో నటించేందుకు వెళ్లిన పొడుగు కాళ్ల సుందరి దీపికా పదుకొణెను అడిగితే వృత్తిపరంగా.. వ్యక్తిగతంగా తానేమీ మారలేదని అంటోంది.

 నన్ను వేరు చేయలేరు

నన్ను వేరు చేయలేరు

''నేను నటించేది హాలీవుడ్‌లోనా.. బాలీవుడ్‌లోనా అని చూసుకోను. ఎందులోనైనా నటిస్తా. అయితే.. నా మూలాలు బాలీవుడ్‌లోనే ఉన్నాయి.

చివరికి నేను బాలీవుడ్‌కి చెందిన నటిగానే ఉంటాను. నా నుంచి భారత్‌ను వేరు చేయలేరు. ప్రజలు సెలవుల్లో ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారు. మళ్లీ తిరిగి ఇంటికే వస్తారు. నేను కూడా అంతే. ప్రపంచంలో ఎక్కడ నటించినా.. తిరిగి నేను భారత్‌కే చేరుకుంటా. అది ఎప్పటికీ మారదు'' అని దీపిక రీసెంట్ గా చెప్పుకొచ్చింది.

 షాకింగ్ ఉంటుంది తెలిస్తే..

షాకింగ్ ఉంటుంది తెలిస్తే..

రీసెంట్ గా ఫోర్బ్స్ చెప్పిన లెక్కల ప్రకారం.. దీపికా 80 కోట్లు సంపాదిస్తుంటే.. ప్రియాంక 73 కోట్లు ఏటా గడిస్తోంది. దీపిక కంటే ముందే హాలీవుడ్ లో అడుగు పెట్టేసింది పీసీ. గతేడాది దీపిక నటించిన సినిమాలు ఏకంగా వెయ్యి కోట్లు రాబట్టేశాయి. అందుకే నిర్మాతలంతా దీపిక చుట్టూ తిరుగుతున్నారు. ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఆమెను ఆ స్దాయిలోకి తీసుకు వెళ్లింది.

 కింగ్ ఫిషర్ నుంచే మొదలు

కింగ్ ఫిషర్ నుంచే మొదలు


దీపిక...మోడలింగ్‌ లోకి వచ్చి 2006లో కింగ్‌ఫిషర్‌ క్యాలెండర్‌గాళ్‌గా ఆలరించింది. ఇక అక్కడినుంచి సినిమా ఛాన్సులు వరించాయి. కన్నడ సినిమా ఐశ్వర్యతో కెరీర్‌ ప్రారంభించి బాలీవుడ్‌లో ఓం శాంతి ఓం చిత్రంతో తొలి అడుగులు వేసింది. తర్వాత బాలీవుడ్‌ దర్శకనిర్మాతలు కోట్లలో పారితోషికాలు చెల్లించి హీరోయిన్‌గా అవకాశాలిచ్చారు.

 ఇండిడ్యువల్ గా ఎదలాగాలంటే..

ఇండిడ్యువల్ గా ఎదలాగాలంటే..

బాలీవుడ్‌లో క్రేజీయెస్ట్‌ హీరోయిన్‌. ఓవైపు కమర్షియల్‌ సినిమా హీరోయిన్ గా రాణిస్తూనే, పీకూ వంటి ప్రయోగాలతోనూ ఆకట్టుకుంటోంది. అయితే దీపిక ఇంత పెద్ద స్థాయికి ఎదగడం వెనక ఆసక్తికర సంగతులు ఉన్నాయి. మేల్ డామినేషన్ గల ఈ సినీ పరిశ్రమలో ఎదగాలంటే...తమకంటూ సొంత ఇమేజ్ ఏర్పాటు చేసుకోవాలి. అందుకోసం ప్రయోగాలే దారి. అందుకే దీపిక తన చుట్టూ తిరిగే కథలకే ప్రాధాన్యత ఇస్తోంది

 మనస్పర్దల గురించి...

మనస్పర్దల గురించి...

ఇటీవల రణ్‌వీర్‌ సింగ్‌తో దీపికకు మనస్పర్థలు వచ్చాయని వార్తలు వినిపించాయి. మరి నిజంగానే రణ్‌వీర్‌కి దూరమయ్యారా? అని అడిగితే.. ''ఈ విషయంలో నేను ఇదివరకు ఎప్పుడూ స్పందించలేదు. ఇప్పుడు కూడా స్పందించను. రణ్‌వీర్‌ నాకు ఎల్లప్పుడూ అండగా ఉంటాడు. నా జీవితంలో అతి ముఖ్యమైన వ్యక్తి. ఇందులోనూ ఎలాంటి మార్పులేదు' అని స్పష్టం చేసింది దీపిక.

 రణబీర్ నుంచీ రణవీర్ దాకా

రణబీర్ నుంచీ రణవీర్ దాకా

దీపికా పదుకొనే....రణవీర్ సింగ్తో ఎంగేజ్మెంట్ చేసుకోవాలనే ఛాయిస్ తీసుకున్నట్లు బాలీవుడ్ జనాలు చెప్పుకుంటున్నారు. మొదట క్రికెటర్లు యువరాజ్సింగ్ ధోనీలతో.. ఆపై బాలీవుడ్ అందగాడు రణబీర్ కపూర్.. తర్వాత విజయ్ మాల్యా కొడుకు సిద్దార్థ్ మాల్యాతో వ్యవహారం నడిపిన దీపిక చివరగా రణవీర్ సింగ్ దగ్గర వచ్చి ఆగింది. రామ్ లీలా రోజుల నుంచి వీళ్లిద్దరి మధ్య ఎఫైర్ నడుస్తోంది.

 ఫేమ్ లో వెనకే బడింది మరి..

ఫేమ్ లో వెనకే బడింది మరి..

తొలిసారి హాలీవుడ్‌ తారల జాబితాలో చోటు దక్కించుకుంది. తొలి హాలీవుడ్‌ చిత్రం ట్రిపుల్‌ ఎక్స్‌లో దీపికాది మంచి ప్రాధాన్యం ఉన్న పాత్ర. స్టార్‌ హీరో విన్‌ డీజిల్‌తో పోటాపోటీగా ఉండే రోల్‌. ప్రియాంకతో పోలిస్తే ఫేమ్‌లో దీపికా కొంచెం వెనకే ఉంది. హాలీవుడ్‌ అవకాశాలను పెంచుకోవడానికి గతంలో ప్రియాంక హాలీవుడ్‌ వ్యవహారాలు చూసిన విలియం మోరీస్‌ ఎండీవర్స్‌ ఏజెన్సీనే నమ్ముకుంది. గతేడాది దీపికా నటించిన సినిమాలు వెయ్యికోట్ల వసూళ్లు రాబట్టాయి. బాలీవుడ్‌లో మొదటి సినిమాకే ఫిలింఫేర్‌ అందుకుంది.

English summary
Deepika Padukone is always praised for her amazing fashion sense and her style game is always on point but this time she failed to impress her fans. Bollywood diva Deepika Padukone attended Giant Awards in Mumbai recently but instead of looking beautiful the actress was looking weird in her bizarre outfit. You can check out the pictures below.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu