»   » కత్రినా జుట్టు రంగు కోసం 55 లక్షల ఖర్చు! (ఫోటోస్)

కత్రినా జుట్టు రంగు కోసం 55 లక్షల ఖర్చు! (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈ విషయం విని మీరే కాదు... మేమూ షాకయ్యాం. కానీ ఇది నిజమే అంటున్నారు. మొదట నిర్మాతలు కూడా కత్రినా జుట్టుకు వేసే రంగు అయ్యే బడ్జెట్ ఖరీదు విని షాకయ్యారు. కత్రినా కైఫ్ నటిస్తున్న ‘ఫితూర్' చిత్రంలో డిఫరెంట్ రెడ్ హెయిర్ తో కనిపిస్తుంది. ఆమె జుట్టుకు ఈ రంగు రావడానికి చాలా ఖర్చు పెట్టారు.

బాలీవుడ్ రిపోర్ట్స్ ప్రకారం... ఫితూర్ సినిమాలో కత్రినా జుట్టుకు ఆ విధమైన ఎరుపు రంగు తెచ్చే ప్రొఫెషనల్స్ ముంబైలో దొరకలేదట. దీంతో లండన్ కు చెందిన హెయిర్ కలర్ నిపుణులతో ఆమె జుట్టుకు రంగు వేయించారు.

సినిమా షూటింగ్ జరిగినంత కాలం కత్రినాకు పలు దఫాలుగా జుట్టుకు ఎరుపు రంగు వేయించారు. ఇందుకోసం ప్రతి సారి ఆమె లండన్ వెళ్లాల్సి వచ్చింది. ఆమెతో పాటు ఆమె మేనేజర్ కు బిజినెస్ క్లాస్ ఫ్లైట్ టికెట్స్, లండన్లో ఉండటానికి ఫైవ్ స్టార్ హోటల్ లో అకామిడేషన్.... ఇలా అన్ని కలిపి కేవలం కత్రినా జుట్టుకు రంగు కోసం రూ. 55 లక్షలు ఖర్చు పెట్టారట.

కత్రినా కైఫ్, ఆదిత్యరాయ్ కపూర్ జంటగా అభిషేక్ కపూర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫితూర్' మూవీ ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 12న విడుదల చేస్తున్నారు. ప్రేమికులకు సరిగ్గా రెండు రోజుల ముందు విడుదల చేయడం ద్వారా బిజినెస్ పరంగా కలిసొస్తుందని భావిస్తున్నారు.

స్లైడ్ షోలో ఫితూర్ సినిమాకు సంబంధించిన ఫోటోస్..

సెట్లో కత్రినా..

సెట్లో కత్రినా..


ఫితూర్ మూవీ సెట్లో కత్రినా కైఫ్, ఆదిత్య రాయ్ కపూర్

ఫితూర్

ఫితూర్


ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ విడుదల చేయగా భారీ రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ విడుదలైన 24 గంటల లోపే మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది.

కత్రినా లుక్

కత్రినా లుక్


ఫితూర్ మూవీలో కత్రినా కైఫ్ ఇలా ఎరుపు రంగు జుట్టుతో కనిపిస్తుంది.

నవల ఆధారంగా

నవల ఆధారంగా


ఈ చిత్రాన్ని చార్లెడ్ డికెన్స్ రచించిన ‘గ్రేట్ ఎక్స్‌పెక్టేషన్స్' నవల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు అభిషేక్ కపూర్

ఆదిత్యరాయ్

ఆదిత్యరాయ్


హీరో ఆదిత్య రాయ్ కపూర్ సిక్స్ ప్యాక్ బాడీతో హరింత హాటుగా కనిపించబోతున్నాడు. అతనితో పోటీ పడేలా కత్రినాను కూడా సూపర్ హాట్ అండ్ సెక్సీగా ప్రజెంట్ చేసాడు దర్శకుడు.

English summary
Shocked? So are we! But according to recent reports, Katrina Kaif's red hair in Fitoor costs Rs 55 lakhs. Not just that, even the producers of the movie were shocked to know their leading lady's hair colour's price.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu