గుర్తించలేనంత మార్పు, మగవాడైన సన్నీలియోన్: ఆ సినిమా కోసమే ఈ మేకోవర్
అందంలో అయితే సన్నీ లియోన్‌ని ఎవ్వరితో పోల్చలేము అనే టాక్ ను కూడా సంపాదించుకుంది. అయితే ఇంతవరకు అనేక రకాల పోటోలను పోస్ట్ చేసిన సన్నీ ఎవరు కలలో కూడా ఉహించుకోలేని గెటప్ తో దర్శనం ఇచ్చింది.
Recommended Video

సన్నీ లియోన్ అంటేనే సెక్స్ ఇమేజ్ ఉన్న బ్యూటీ. ప్రస్తుతం సన్నీ లియోన్ బాలీవుడ్లో వరుస ప్రాజెక్టులతో దూసుకెలుంతోంది. ఐటెం సాంగ్స్‌తో కుర్రకారు గుండెల్లో రైళ్లు పరుగులెత్తిస్తున్న సన్నీ లియోన్. సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ ప్రధాన పాత్రధారిగా తెరకెక్కుతున్న "తేరా ఇంతజార్" అనే సినిమాలో నటిస్తుంది.

తేరా ఇంతజార్
వచ్చే నెల 24వ తేదీన విడుదల కానుంది. ఈ చిత్రంలో సుధా చంద్రన్, సలీల్ అంఖోలా, రైచా శర్మ, గౌహర్ ఖాన్, హనీఫ్ నోయిడా, భణీ సింగ్, ఆర్య బబ్బర్ ముఖ్య పాత్రలు పోషించారు.మ్యూజికల్ రొమాంటిక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రాజీవ్ వాలియా తెరకెక్కిస్తున్నాడు.

ప్రయోగాత్మకంగా
ఈ సినిమా ఎంతో ప్రయోగాత్మకంగా తెరెకెక్కుతోందిని సినిమాలోని కొన్ని గెటప్స్ ద్వారా చెబుతోంది. అయినా సన్నీ ఇంతవరకు గ్లామర్ ప్రపంచంలో ఉన్న అన్ని లుక్స్ లో కనిపించింది. లో దుస్తులు బికినీ అండ్ ఇండియన్ శారీలలో కూడా కనిపించి కుర్రకారును ఎంతో ఆకట్టుకుంది. ఆమె వేసిన ప్రతి డ్రెస్ లో ఎదో ఒక స్పెషాలిటీ ఉండేది.

కలలో కూడా ఉహించుకోలేని గెటప్
అందంలో అయితే సన్నీ లియోన్‌ని ఎవ్వరితో పోల్చలేము అనే టాక్ ను కూడా సంపాదించుకుంది. అయితే ఇంతవరకు అనేక రకాల పోటోలను పోస్ట్ చేసిన సన్నీ ఎవరు కలలో కూడా ఉహించుకోలేని గెటప్ తో దర్శనం ఇచ్చింది.

సన్నీ బాయ్ గా ఉంటే
పూర్తిగా మగవాడి గెటప్ లో కనిపించిన సన్నీ బాయ్ గా ఉంటే ఇలానే ఉంటుందేమో అనేలా షాక్ ఇచ్చింది. వెరైటీ హెయిర్ స్టైల్ తో అలాగే మీసాలతో గెడ్డంతో బలే కొత్తగా కనిపించింది. అయితే ఈ లుక్ లో తనను తాను చూసుకుంటే నా బ్రదర్ - ఫాధర్ గుర్తొస్తున్నారని తెలిపింది.


Click it and Unblock the Notifications











