టాలీవుడ్ లో విషాదం.. గుండెపోటుతో యువనటుడు మృతి
ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తల్లి గీతాంజలి అనారోగ్య కారణాలతో కన్నుమూసిన వార్త మరువకముందే టాలీవుడ్ లో మరో తీవ్ర విషాద సంఘటన నెలకొంది. టాలీవుడ్ కు చెందిన ఒక యువ వర్తమాన నటుడు గుండెపోటు కారణంగా మరణించినట్లుగా వార్తలు వెళ్లడవుతున్నాయి. అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే...
ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండె సంబంధిత సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి. భోపాల్ దగ్గరలోని ఒక గ్రామంలో అయితే 10 ఏళ్ల బాలుడు కూడా గుండెపోటుతో మరణించాడు అనే వార్తలు మనం చూసాం. ఇప్పుడు ఏ వయసు వారికి గుండెపోటు వస్తుందో ఎవరు బతకగలుగుతున్నారో ఎవరు చనిపోతున్నారు కూడా ఎవరూ చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా టాలీవుడ్ కు చెందిన ఒక యువ వర్తమాన నటుడు గుండెపోటు కారణంగా మరణించారు.

యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కీలక పాత్రలో నటిస్తూ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం కీడా కోలాలో సదరు నటుడు కీలక పాత్రలో నటించాడు. పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది వంటి సినిమాలతో దర్శకుడిగా ప్రత్యేకతను చాటుకున్న తరుణ్ భాస్కర్ కొంత విరామం తరువాత ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. బ్రహ్మానందం ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. కామెడీ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల యముందుకు రానున్న క్రమంలో రీసెంట్‌గా టీజర్‌ని కూడా మేకర్స్ రిలీజ్ చేశారు.
సురేష్ ప్రొడక్షన్స్‌పై ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు. రీసెంట్‌గా విడుదల చేసిన టీజర్‌కు అనూహ్య స్పందన లభిస్తోన్న క్రమంలో సినిమాపై అంచనాలు ఏర్పడటంతో టీమ్ అంతా హ్యాపీ మూడ్ లో ఉండగా వారందరికీ షాక్ కలిగించే ఒక వార్త తెరమీదకు వచ్చింది. కీడా కోలా టీమ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈ మూవీలో నటించిన ఓ నటుడు శనివారం హఠాత్తుగా మృతి చెందారు.
నటుడు హరికాంత్ (33) శనివారం గుండెపోటు కారణంగా మృతి చెందారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. రంగస్థల నటుడిగా పేరు తెచ్చుకున్న హరికాంత్ కీడా కోలా మూవీతో వెండితెరపై నటుడిగా గుర్తింపుని సొంతం చేసుకోవాలనుకున్నాడనీ ఇంతలోనే గుండెపోటుతో శనివారం ఉదయం మరణించడం షాక్ అనిపిస్తోందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
టీజర్‌లో గన్ పట్టుకుని హల్ చల్ చేసిన హరికాంత్ సినిమా రిలీజ్ కు ముందే హఠాత్తుగా మరణించడంతో సినిమా యూనిట్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక ఈ క్రీడాకాల సినిమా త్వరలోనే ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది ఈ సినిమా తర్వాత తరుణ్ భాస్కర్ విక్టరీ వెంకటేష్ హీరోగా ఒక సినిమా తెరకెక్కించే అవకాశాలు ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది


Click it and Unblock the Notifications











