యువ హీరోయిన్ హఠాన్మరణం..24 ఏళ్ల వయసులో గుండెపోటుతో కన్నుమూత

ఈ మధ్య సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు తనువు చాలిస్తున్నారు. ఒకరి మరణ వార్త తర్వాత మరొకరి కన్నుమూత సినీ ఇండస్ట్రీని కలిచివేస్తుంది. కొందరు ఆరోగ్య సమస్యలతో కన్నుమూస్తుంటే మరికొందరు బలవన్మరణాలతో మరణిస్తున్నారు.

ఇటీవలే సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూయగా ఆయనకంటే ముందుగా నటుడు కృష్ణం రాజు తనువు చాలించారు. ఇలా ఒక్కొక్కరిగా నటీనటుల మరణం సినీ ఇండస్ట్రీకి విషాదం మిగుల్చుతోంది. తాజాగా సూపర్ స్టార్ కృష్ణ తరహాలోనే గుండెపోటుతో ఓ యువ నటి హఠాన్మరణం చెందింది. అలాగే ఆమె ఆరోగ్యానికి సంబంధించిన పలు షాకింగ్ నిజాలలోకి వెళితే..

పలు మార్లు గుండెపోటు..

పలు మార్లు గుండెపోటు..

తాజాగా బెంగాలీ యువ నటి ఐండ్రిలా శర్మ (Aindrila Sharma) మరణించింది. ఆమె మరణంతో బెంగాలి చిత్రసీమలో విషాదం చోటుచేసుకుంది. 24 ఏళ్ల ఐండ్రిలా శర్మ బ్రెయిన్ స్ట్రోక్ తో నవంబర్ 1న హౌరాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఐండ్రిలా అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నాం 12.59 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న ఐండ్రిలాకు శనివారం రాత్రి పలుమార్లు గుండెపోటు వచ్చినట్లు హాస్పిటల్ వర్గాలు తెలిపాయి.

సూపర్ స్టార్ కృష్ణ తరహాలోనే..

సూపర్ స్టార్ కృష్ణ తరహాలోనే..

ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న యంగ్ యాక్ట్రెస్ ఐండ్రిలా శర్మకు ఆదివారం మరోసారి గుండెపోటు వచ్చిందని.. సీపీఆర్ కు కూడా ఆమె శరీరం స్పందించలేదని వైద్యులు తెలిపారు. దీంతో ఆమెను కాపాడలేకపోయామని తెలుపుతూ ఐండ్రిలా శర్మ మరణాన్ని ధ్రువీకరించారని తెలుస్తోంది. ఇలాగే సూపర్ స్టార్ కృష్ణ గుండెపోటుతో మరణించారు. చికిత్సకు ఆయన శరీరం సహకరిస్తుందో లేదో అని కాంటినెంటల్ హాస్పిటల్ డాక్టర్స్ చెప్పిన విషయం తెలిసిందే.

రెండు సార్లు క్యాన్సర్..

ఐండ్రిలా శర్మ 24 ఏళ్ల అతి చిన్న వయసులోనే రెండుసార్లు క్యాన్సర్ ను జయించింది. రెండు సార్లు ఆమెకు క్యాన్సర్ మహమ్మారి రాగా.. దాని నుంచి ఆమె పూర్తిగా కోలుకున్నారని వైద్యులు స్పష్టం చేసిన తర్వాతే ఆమె మళ్లీ నటన ప్రారంభించింది. అయితే అనుకోకుండా నవంబర్ 1న ఐండ్రిలా తీవ్రమైన బ్రెయిన్ స్ట్రోక్ కు గురయ్యారు. దీంతో ఆమెను హౌరాలోని ఆసుపత్రికి తరలించారు.

మూడు వారాలపాటు పోరాటం

ఐండ్రిలా శర్మను ఆసుపత్రికి తరలించినప్పటి నుంచి ఆమెకోసం బెంగాలీ టీవీ, సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, ఆమె అభిమానులు ప్రార్థిస్తూనే ఉన్నారు. సుమారు మూడు వారాల పాటు మృత్యువుతో పోరాడిని ఐండ్రిలా శర్మ చివరికి తనువు చాలించారు. దీంతో బెంగాలీ సినీ ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి లోనైంది.

సెలబ్రిటీల సంతాపం..

టెలివిజన్ షో ఝుమూర్ తో ద్వారా యాక్టింగ్ కెరీర్ ప్రారంభించిన ఐండ్రిలా శర్మ.. జియెన్ కతి, జీవన్ జ్యోతి వంటి డైలీ సీరియల్స్ లో నటించింది. టీవీ నుంచి డిజిటల్ మీడియంలోకి అడుగుపెట్టిన ఐండ్రిలా శర్మ ఇటీవల భగర్ అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఈ వెబ్ సిరీస్ లో ఐండ్రిలా శర్మ బాయ్ ఫ్రెండ్ సవ్యసాచి కూడా ఓ కీలక పాత్రలో నటించాడు. ఇక ఐండ్రిలా శర్మ మృతిపట్ల సెలబ్రిటీలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X