ప్రేమ విఫలం: హీరోయిన్ ఆత్మహత్యాయత్నం
బెంగళూరు : ప్రేమ విఫలం కావటంతో వర్ధమాన నటి వింధ్య ఆత్మహత్యకు యత్నించారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. మంగళవారం ఆమె చక్కెర వ్యాధి నియంత్రణకు వినియోగించే 40కిపైగా మాత్రల్ని మింగారు. అపస్మారక స్థితిలోకి చేరుకున్న వింధ్యను కుటుంబ సభ్యులు బౌరింగ్ ఆసుపత్రికి తరలించారు. ప్రేమ వ్యవహారమే ఈ తీవ్ర నిర్ణయానికి కారణమని తెలిసింది.

కొంతకాలంగా మంజునాథ్ అనే యువకుడితో స్నేహంగా ఉండేది. ఈ విషయం కుటుంబ సభ్యులకు కూడా తెలుసు. కొన్ని రోజుల పాటు వీరిద్దరూ సిమ్లా వెళ్లివచ్చారు. అప్పటి నుంచే ఇద్దరి నడుమ అభిప్రాయబేధాలు తలెత్తాయి. తనతో మాట్లాడవద్దంటూ గత వారం వింధ్య అతడిని వారించినట్లు తెలిసింది.
ఇరు కుటుంబాల పెద్దలు కల్పించుకుని వింధ్యతో ఇకముందు మంజునాథ్ మాట్లాడరాదని ఆదేశించారు. సోమవారం రాత్రి ఏమి జరిగిందో! ఉదయాన్నే ప్రముఖ నటుడు విజయ్‌కు వింధ్య ఫోన్ చేసి తాను జీవించాలనుకోవడం లేదని చెప్పినట్లు తెలిసింది. ఆ వెంటనే ఆమె మాత్రల్ని మింగింది. మనదమరెయలి సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











