చిరంజీవి సినిమా టైటిల్‌తో.. టాలీవుడ్‌కు మరో యువ హీరో
మెగాస్టార్ చిరంజీవి మొదటి సినిమా టైటిల్‌తో హీరోగా నా మొదటి సినిమా ప్రాణం ఖరీదు రావడం ఆనందంగా ఉందని మూవీ హీరో ప్రశాంత్ అన్నారు. ఈ చిత్రం ద్వారా టాలీవుడ్‌కు ప్రశాంత్ పరిచయం కాబోతున్నాడు. ఈ చిత్రంలో అవంతిక హీరోయిన్‌గా, నందమూరి తారకరత్న ముఖ్య పాత్రలో కనిపిస్తున్నారు. యన్ఎస్ క్రియేషన్స్ పతాకంపై పద్మప్రియ సమర్పణలో నల్లమోపు సుబ్బారెడ్డి నిర్మాతగా పిఎల్‌కే రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ప్రాణం ఖరీదు.
ప్రాణం ఖరీదు మూవీ నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని యూ/ఏ సెన్సార్ సర్టిఫికెట్ సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం టీజర్ విడుదల ఈ సందర్భంగా దర్శకుడు పి. ఎల్. కె. రెడ్డి మాట్లాడుతూ ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం. ముందుగా మా చిత్ర టీజర్ ని విడుదల చేసాము మంచి రెస్పాన్స్ రావడం చాలా ఆనందంగా ఉంది అని అన్నారు.

ప్రొడ్యూసర్ నల్లమోపు సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. మా ప్రాణం ఖరీదు మూవీ టీజర్‌ని సోషల్ మీడియాలో విడుదల చేస్తాం.
హీరో ప్రశాంత్ మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి గారి మొదటి సినిమా పేరు నా మొదటి సినిమా పేరు "ప్రాణం ఖరీదు" అవడం నాకు చాలా ఆనందం గా ఉంది. మా కథకి తగ్గ టైటిల్ కావడంతో మేము ఈ టైటిల్ పెట్టడం జరిగింది. ప్రాణం ఖరీదు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ చూస్తున్నంత సేపు నెక్స్ట్ ఏమి జరగబోతుంది అనే ఉత్కంఠతో ఈ కథ నడుస్తుంది.

ఈ చిత్రంలో నటీనటులు, సాంకేతికవర్గం
నటీనటులు ప్రశాంత్, అవంతిక, నందమూరి తారకరత్న ,షఫి, జెమినీ సురేష్ ,చిత్రం శ్రీను, ఫణి రాజమౌళి( జబర్దస్త్ ఫేమ్) సంజన.
టెక్నిషియన్స్ కెమెరా మెన్ : మురళి మోహన్ రెడ్డి , సంగీతం: వందేమాతరం శ్రీనివాస్ మాటలు: మారుదూరి రాజా
పి ఆర్. ఓ: కడలి రాంబాబు
నిర్మాత: నల్లమోపు సుబ్బారెడ్డి
దర్శకత్వం: పి. ఎల్.కె. రెడ్డి


Click it and Unblock the Notifications











