»   » ప్రియురాలి కోసం తపిస్తున్న యువ హీరో..వచ్చే ఏడాది అయినా..!

ప్రియురాలి కోసం తపిస్తున్న యువ హీరో..వచ్చే ఏడాది అయినా..!

Subscribe to Filmibeat Telugu
అమ్మాయిలూ 'అబ్బాయిలని' బలవంత పెట్టొద్దు ?

వాలంటైన్స్ డే రోజు మన హీరోలందరికి ప్రేమ పెళ్లి వంటి విషయాలు గుర్తుకు వచ్చినట్లు ఉన్నాయి. టాలీవుడ్ యంగ్ హీరోలు, ప్రముఖులంతా సోషల్ మీడియా వేదికగా ప్రేమికుల రోజు శుభాకాంక్షలు తెలియజేసారు. యువ హీరో నాగ శౌర్య కూడా వాలంటైన్స్ డే సందర్భంగా స్పందించాడు. ఛలో చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న నాగ శౌర్య రెట్టించిన ఉత్సాహంతో కొత్త ప్రాజెక్ట్ లకు సిద్ధం అవుతున్నాడు.

వాలంటైన్స్ డే శుభాకాంక్షలు

వాలంటైన్స్ డే శుభాకాంక్షలు

ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగశౌర్య అందరికి వాలంటైన్స్ డే శుభాకాంక్షలు తెలియజేసాడు. అందరికి ప్రేమికుల రోజు శుభాకాంక్షలు. ప్రేమికులందరి ప్రేమ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా. ఆల్రెడీ ప్రేమ సక్సెస్ అయితే పెళ్ళికి ఆల్ ది బెస్ట్. పెళ్లి కూడా అయిపోతే పిల్లలు పుట్టడానికి ఆల్ ది బెస్ట్. పిల్లలు కూడా పట్టి ఉంటె వాళ్ళ స్కూల్ ఫీజులకు ఆల్ ది బెస్ట్ అంటూ నాగ శౌర్య సరదాగా వ్యాఖ్యానించాడు.

అమ్మాయిలని అబ్బాయిలు..అబ్బాయిలని అమ్మాయిలు

అమ్మాయిలని అబ్బాయిలు..అబ్బాయిలని అమ్మాయిలు

మీ ప్రేమని సాఫ్ట్ గా, పాజిటివ్ గా వ్యక్త పరచండి అంటూ నాగశౌర్య తన సందేశాన్ని తెలియజేసాడు. అమ్మాయిలు ప్రేమకు అంగీకరించకపోతే వారిని బలవంత పెట్టొద్దు. అమ్మాయిలని అబ్బాయిలు అలాగే అబ్బాయిలని అమ్మాయిలు ఇబ్బందికి గురి చేయవద్దని నాగ శౌర్య హితవు పలికాడు.

ఛలోతో జోష్

ఛలోతో జోష్

నాగ శౌర్య ఛలో చిత్రంతో ఎట్టకేలకు మంచి విజయాన్ని అందుకున్నాడు. ఛలో చితం శౌర్య కెరీర్ కు బూస్ట్ ఇచ్చిందని చెప్పొచ్చు. అదే ఉత్సాహంతో కొత్త ప్రాజెక్ట్ లపై దృష్టి పెట్టాడు.

ప్రియురాలికోసం తపిస్తున్నాడుగా

ప్రియురాలికోసం తపిస్తున్నాడుగా

నాగ శౌర్య వాలంటైన్స్ డే రోజు తన ప్రేమ జీవితం గురించి మాట్లాడాడు. ఈ హీరో ఇంత వరకు ఎవరిని ప్రేమించలేదట. ప్రియురాలి కోసం ఎదురుచూస్తున్నాడట. అందరి ఆశీర్వాదం ఉంటె వచ్చే ఏడాది అయినా ఒక అమ్మాయితో ఉంటానని సరదాగా వ్యాఖ్యానించాడు.

English summary
Young Hero Naga Shaurya interesting comments on valentines day. Naga Shaurya gives simple message to youth
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu