గణేష్...జస్ట్ గణేష్
వెంకటేష్ హీరోగా గతంలో 'గణేష్' అనే టైటిల్ తో ఓ మెడికల్ ధ్రిల్లర్ వచ్చింది. అయితే ఇప్పుడదే టైటిల్ ని రామ్ హీరోగా తయారవుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ కి పెట్టనున్నారని సమాచారం. దానికి ట్యాగ్ లైన్ గా జస్ట్ గణేష్..అని ఉంచనున్నారు.ఈ చిత్రంలో హీరో పేరు గణేష్ కావటంతో ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఈ మేరకు ఫిల్మ్ ఛాంబర్ లో టైటిల్ ని దర్శక, నిర్మాతలు రిజస్టర్ చేసినట్లు సమాచారం. కాజల్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. అందులోనూ మస్కా భాక్సాఫీస్ వద్ద పెద్దగా వర్కవుట్ కాకపోవటంతో ఈ చిత్రంపై రామ్ సైతం పూర్తి దృష్టి పెట్టి చేస్తున్నారు.రెడీ హిట్ అనంతరం స్రవంతి రవికిషోర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా ఓ కొత్త దర్శకుడు పరిచయమవుతున్నాడు. మురుగదాస్ శిష్యుడైన అతను ఈ చిత్రాన్ని పక్తు ఎంటర్టైనర్ గా చేస్తున్నాడని, స్క్రిప్టుకే అధిక ప్రాధాన్యత ఇచ్చి రూపొందిస్తున్నాడని సమాచారం. ఇవన్నీ చూస్తుంటే గణేష్..జస్ట్ సూపర్ హిట్ అంతే అని పరిశ్రమవర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











