అనుష్క ఎంకరేజ్ మెంట్ ఆ యంగ్ హీరోకి బాగా నచ్చిందిట
తను నెంబర్‌వన్ పొజిషన్‌లో ఉండి, కొత్తవాణ్ణయినా నన్ను ఎంతో ఎంకరేజ్ చేసింది. ఆమె నుంచి చాలా నేర్చుకున్నా అంటున్నారు హీరో సామ్రాట్. 'పంచాక్షరి'లో అనుష్క సరసన హీరోగా కనిపించిన ఈ యువనటుడు ఆమెని పొగడ్తల్లో ముంచెత్తుతున్నాడు.అలాగే...అనుష్క వంటి సూపర్ హీరోయిన్ సరసన నటించడం మరచిపోలేని అనుభవం. ఆమె నుంచి చాలా నేర్చుకున్నాను. 'పంచాక్షరి' లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ అయినప్పటికీ అనుష్క వంటి హీరోయిన్ సరసన నటించడం మరచిపోలేని అనుభవం. దాంతో నాలుగైదేళ్లుగా నేను పడుతున్న కష్టానికి కొంత ఫలితం దక్కిందనిపించింది. కానీ నిజం చెప్పాలంటే ఇది లేడీ ఓరియంటెడ్ సినిమా కావడం వల్ల నా ప్రతిభని నిరూపించుకునే అవకాశం ఎక్కువగా రాలేదు. అయితే ఆ సినిమాలో నా నటనకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతా ఆ పాత్రకి న్యాయం చేశానని ప్రశంసించారు అని చెప్పాడు సామ్రాట్. అతను ప్రస్తుతం సిద్దార్ధ 'బావ' చిత్రంలో పూర్తిస్థాయి నిడివి ఉండే నెగటివ్ పాత్రని చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











