చిరంజీవి సినిమాలను చూసి పెరిగానంటున్న యంగ్ హీరో
"నేను చిరంజీవి సినిమాలను చూసి పెరిగాను. అలాగే శ్రీదేవి అన్నా ఇష్టం. 'గీతాంజలి' సినిమాను ఎన్ని సార్లు చూశానో నాకే తెలియదు. చూసిన ప్రతిసారీ మనస్సుకు హత్తుకుంటుంది" అని అన్నారు శర్వానంద్. ఆయన చిత్రం ప్రస్దానం రీసెంట్ గా ఇండియన్ పనోరమకు ఎంపికైన సందర్భంగా మీడియాతో ముచ్చటిస్తూ ఇలా చెప్పుకొచ్చారు. అలాగే తన సినిమాలు బాగున్నాయని టాక్ వచ్చినా ప్రేక్షకాదరణ నోచుకోపోవటానికి కారణం విశ్లేషించారు.
ఆయన మాటల్లోనే..ఇక్కడ ప్రేక్షకులను తప్పుబట్టలేం. సినిమా బాగుందా? లేదా? అనే విషయానికే వారు ప్రాధాన్యమిస్తారు. మంచి సినిమాను తప్పకుండా ఆదరిస్తారు ప్రేక్షకులు. ఆ విషయం ఎన్నోసార్లు రుజువు చేశారు. సినిమా వారికి నచ్చలేదంటే మన దగ్గరే ఏదో లోపం జరిగి ఉండాలి. 'ప్రస్థానం', 'అందరి బంధువయ' లాంటి చిత్రాల్ని ప్రేక్షకులకు మరింత చేరువగా తీసుకెళ్లలేకపోయాం. చూసినవాళ్లందరూ బాగున్నాయన్నారు. కానీ సంతృప్తి కలగలేదు అన్నారు.
అలాగే నాకు సినిమాలంటే పిచ్చి. అందుకే నిజాయతీగా ఈ రంగంలోనే కృషి చేస్తున్నాను. కథానుగుణంగా నటించడమంటే నాకు నచ్చుతుంది. కథ డిమాండ్ చేస్తే తప్పకుండా యాక్షన్ సన్నివేశాల్లోనూ మెప్పించాలని ఉంది అన్నారు.


Click it and Unblock the Notifications











