చెట్టు‌పేరు చెప్పి సినిమాలమ్ముంకుటున్న యువహీరోలు

By Bojja Kumar

ఒకప్పుడు ప్రేక్షకులను మెప్పించే విధంగా మంచి నటనా శైలి ఉంటే చాలు సులభంగా సినిమా అవశాలు దక్కేవి. తమ టాలెంట్‌తోనే సినిమా రంగంలో ఎదిగే వారు. కానీ ప్రస్తుతం ట్రెండు మారింది. ఘనమైన ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తో పాటు కాస్తో కూస్తో టాలెంట్ ఉంటే చాలు ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఓ ఊపు వూపొచ్చు. అందుకే మన తెలుగు సినిమా ఇండ్రస్ట్రీలో వారసత్వంతో వచ్చిన హీరోలు తప్ప బ్యాంగ్రౌండ్ లేని హీరోలు పైకి ఎదగడం లేదు.

తమ తండ్రులు, తాతలకు ఉన్న క్రేజ్‌ను తమకు అనుకూలంగా వాడుకోవడం ఈ తరం యువ హీరోలు మహేష్ బాబు, జూ.ఎన్టీఆర్ రామ్ చరణ్, అల్లు అర్జున్, నాగచైతన్య తదితర హీరోలు ధిట్ట అని చెప్పక తప్పదు. నిన్నటి తరం హీరోలు నాగార్జు, బాలకృష్ణ తదితరు కూడా వంశం పేరు చెప్పుకుని డబ్బా కొట్టుకున్న వారే కానీ...ఇప్పటి యువహీరోలంత మాత్రం కాదు.

ఇప్పటి సినిమాల ట్రెండు కూడా మారి పోయింది. హీరో చెప్పే డైలాగులతోనే సినిమా తల రాతలు మారి పోతున్నాయి. డైలాగుల్లో వంశం ప్రస్తావన పెట్టేందుకు హీరోలు నిర్మాతలు, దర్శకులపై ఒత్తితెస్తున్నారు కూడా. ఈ డైలాగుల మత్తులో పడి వంశాలను పొగుడుకునే పనిలో పడుతుండటంతో స్కిప్టుపై సరిగా దృష్టిపెట్టడం లేదు. దీంతో కొన్ని సార్లు వీళ్ల ప్రయత్నాలు బెడిసి కొడుతున్నాయి.

నిర్మాతలు కూడా...కథతో సంబంధం లేకుండా పెద్ద హీరోలు, వారసులు ఉంటే చాలు అని ఆలోచస్తున్నారు. ఎంత పెద్ద హీరో ఉంటే తమ డబ్బుకు అంత గ్యారంటీ అనేది వారి నమ్మకం. హీరోల కోసం స్క్రిప్టును కూడా మార్చేస్తున్నారు. కొంత మందయితే కేవలం హీరోలను, వారసులను చూసే కథ అల్లేస్తున్నారు. అందుకే చాలా సినిమా కథలో బలం లేక బోల్తా పడుతున్నాయి.

ఒకప్పుడు పరిస్థితి ఇలా ఉండేది కాదు. తమ సినిమాల్లో వ్యక్తిగత ప్రస్తాన ఉండేది కాదు. స్క్రిప్టును పర్ ఫెక్ట్ గా ఫాలో అయ్యే వారు. అందుకే సక్సెస్ రేటు ఎక్కువగా ఉండేది. మరి చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకునే సంస్కృతి టాలీవుడ్ లో ఎప్పుడు మారుతుందో? వారసత్వంతో సంబంధం లేకుండా టాలెంట్ ఉన్న వారిని ప్రోత్సహించే రోజులు ఎప్పుడు వస్తాయో?

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X