సమంతతో పండగ చేసుకొంటున్న కుర్ర హీరో...?!
'ఏ మాయ చేసావె' చిత్రం తర్వాత సమంతకి విపరీతంగా డిమాండ్ ఏర్పడడంతో ఆమె కొన్ని పెద్ద చిత్రాలని వదిలేసుకుంది. కొందరు సూపర్ స్టార్ల చిత్రాలని కూడా రిజెక్ట్ చేసింది. అంతటి డిమాండ్ ఉన్న సమంతతో ఓ చిన్న హీరో ఒకటి కాదు ఏకంగా రెండు సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకున్నాడు.
రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న 'ఈగ" చిత్రంలో సమంతకి జంటగా నటిస్తున్న నాని ఫ్రెష్ గా గౌతమ్ మీనన్ సినిమాలోనూ నాయకుడిగా ఎంపికయ్యాడు. రామ్ ఈ చిత్రంలో నటించనని చెప్పి వచ్చేయంతో గౌతమ్ ఆ పాత్రకి నానిని ఎంచుకొన్న విషయం తెలిసిందే. దీంట్లో సమంతే కథానాయిక కావడంతో అనుకోకుండా నానికి ఆమెతో వరుసగా రెండోసారి నటించే ఛాన్స్ దక్కింది. సమంతకి ఇప్పుడు టాలీవుడ్ లో మంచి క్రేజ్ లభించింది. యంగ్ హీరోలందరూ ఆమె కోసం క్యూ కడుతున్నారు. అయితే ఆమెతో సినిమా తీయాలంటే మరో ఆరేడు నెలలైనా ఆగక తప్పదు. అసలే రాబోయేది రాజమౌళి సినిమా కాబట్టి సమంత రేటు మరింత పెరగకముందే ఇప్పుడే ఆమె డేట్స్ చేయాలని కొందరు ప్రయత్నిస్తున్నారు.
కాగా సమంత నాని జంటగా రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం 'ఈగ" షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో జరుపుకుంటుంది. నాని, సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం పూర్తి గ్రాఫిక్స్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. సురేష్ బాబు సమర్పణలో, వరాహి చలన చిత్రం మరిరయు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి యంయం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











