పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్న కుర్ర హీరోయిన్!
సాధారణంగా సీనిమాల్లో అవకాశాలు తగ్గిన తర్వాత, వయసు మళ్లాక, ఇక ఇక్కడ మనకు డిమాండ్ లేదు అనే పరిస్థితులు వచ్చాక....రాజకీయాల వైపు దృష్టి సారిస్తుంటారు హీరోయిన్లు. జయలలిత, జయప్రద, జయసుధ, కుష్బూ లాంటి వారంతా ఇదే కోవకు వస్తారు. ఒకప్పుడు వెండితెరపై తమ అందాల వెలుగులు విరజిమ్మిన వీరంతా ఇప్పడు రాజకీయాల్లో హల్ చేస్తున్నారు.
అయితే....వీళ్లందరికి భిన్నంగా దీపం ఉన్నప్పడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటోంది కన్నడ హీరోయిన్ దివ్యస్పందన(సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ లో.. నటించిన సెకండ్ హీరోయిన్). గ్లామర్ ఉన్నప్పుడే పొలిటికల్ గా రాణించాలని ప్లాన్ చేస్తున్న ఈ బెంగుళూరు భామ గతంలో తెలుగులో రెండు సినిమాలు చేసింది. ఇక్కడ అనుకున్నంత డిమాండ్ లేక్ పోవడంతో మళ్లీ కన్నడ సినిమాలపైనే దృష్టి సారించింది. ఇప్పుడు అక్కడ కూడా అవకాశాలు తగ్గి పోవడంతో రాజకీయాల వైపు కన్నేసింది.
ప్రజాసేవ, అవినీతిపై లెక్చర్లు దంచుతూ...రాజకీయాల్లోకి వస్తా, ప్రపజలకు మంచి చేస్తా అంటూ స్టేట్ మెంట్లు ఇచ్చేస్తుంది. మరి దివ్య స్పందన అందాలను వాడుకోవడానికి ఏ రాజకీయా పార్టీ ముందుకు వస్తుందో... చూడాలి మరి.


Click it and Unblock the Notifications











