twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దాసరి ‘యంగ్ ఇండియా’ హీరో అరెస్ట్

    By Bojja Kumar
    |

    Rajesh
    హైదరాబాద్: దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన 'యంగ్ ఇండియా' చిత్రంలో నటించిన ముగ్గురు హీరోల్లో ఒకరైన రాజేష్‍‌ను హైదరాబాద్ కెబిహెచ్‌పి కాలనీ పోలీసులు అరెస్టు చేసారు. ఇంటి ఓనర్‌తో తగాదా పెట్టుకోవడం వల్లనే అతనిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

    రాజేష్ తప్ప తాగి వచ్చి రభస సృష్టించాడని, ఇంటికి అమ్మాయిలను తీసుకుని వస్తున్నాడని, తాను ప్రశ్నించినందుకు తనపై దాడి చేసాడని ఇంటి ఓనర్ సుబ్బారావు పోలీసులకు ఫిర్యాదు చేసాడు. అయితే రాజేష్ కుటుంబ సభ్యులు మాత్రం ఇది అక్రమ అరెస్టు అంటున్నారు.

    కొంత కాలంగా సుబ్బారావు అద్దె పెంచమంటూ గొడవ పెడుతున్నాడని, అగ్రిమెంటు ప్రకారం తాము అద్దె ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదని, అద్దె పెంపు గొడవపై ప్రస్తుతం కోర్టులో కేసు నేడుస్తోందని, అద్దె పెంచడానికి వీల్లేదని కోర్టు స్టే కూడా ఇచ్చిందని, అప్పటి నుంచి యజమాని సుబ్బరావు తమపై కక్షకట్టాడని, ఇంటికి కరెంటు, వాటర్ ఇవ్వకుండా నరకం చూపిస్తున్నాడని రాజేష్ బంధువులు పేర్కొన్నారు.

    ఇంటి ఓనర్‌పై ఎన్ని సార్లు కంప్లైంట్ చేసినా పోలీసులు పట్టించుకోలేదని, ఇప్పుడు తమపై అక్రమంగా కంప్లెంట్ చేస్తే వెంటనే అరెస్టు చేసారని, ఇంటి ఓనర్ సుబ్బారావు బాబూమోహన్ తోడల్లుడు కావడం వల్లనే పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని రాజేష్ బంధువు తెలిపారు. పోలీసులు ఈ సంఘటనపై విచారణ జరుపుతున్నారు. ఏది ఏమైనా వర్దమాన హీరోగా రానిస్తున్న రాజేష్ ఇలా అరెస్టు కావడం సర్వత్రా చర్చనీయాంశం అయింది.

    English summary
    KPHB police have arrested Rajesh, hero of the film ‘Young India’ here on Monday. He had a tiff with his landlord and the latter approached the police. The landlord complained to the Kukatpalli Housing Board police that Rajesh abused and manhandled him. Police took Rajesh into custody.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X