రెండు లక్షలు పలికిన 'యంగ్ ఇండియా' సిడీ

By Srikanya

దాసరి నారాయణ రావు ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న 'యంగ్ ఇండియా' ఆడియో సిడిని ఆయన వేలం వేయగా సుధీష్ రాంభొట్ల ఆ సిడిని రెండు లక్షల రూపాయలకు కొనుగోలు చేశారు. ఈ రెండు లక్షల రూపాయలకు మరో రెండు లక్షలు కలిపి ఫిలిం ఫెడరేషన్ సభ్యుల పిల్లల చదువులకు ఉపయోగపడే విధంగా వినియోగించనున్నట్టు దాసరి ప్రకటించారు. 'యంగ్ ఇండియా' ఆడియో సిడిలను సౌభాగ్య మ్యూజిక్ సంస్థ మార్కెట్లోకి విడుదల చేస్తోంది. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించారు.

ఈ సందర్భంగా దర్శకుడు దాసరి మాట్లాడుతూ...దర్శకుడిగా ఆరేళ్ళ విరామానంతరం ఏ తరహా చిత్రం రూపొందించాలా అని ఎంతో ఆలోచించి కొత్తవారితో, మంచి సందేశంతో సినిమాని రూపొందించాలని నిర్ణయించుకున్నాను. ఇతర భాషల నటీనటులను దిగుమతి చేసుకునే పరిస్థితి ఉండకూడదని భావించే నేను ఈ సినిమా ద్వారా 81 మంది విద్యాధికులైన అచ్చతెలుగు బిడ్డల్ని నటీనటులుగా పరిచయం చేస్తున్నాను. యువతరం జీవితంలో తాము అనుకున్నది ఎలా సాధించాలో చెప్పే చిత్రం మా 'యంగ్ ఇండియా. అలాగే ఈ చిత్రం ఆడియో సిడిలను శ్రోతలకు 9 రూపాయల 90 పైసలకు అందించాలని నిర్ణయించాం అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X