»   » నేనే చిరంజీవి పెద్ద కొడుకును, పవన్ ఎత్తుకున్నాడు: యువకుడి హల్ చల్!

నేనే చిరంజీవి పెద్ద కొడుకును, పవన్ ఎత్తుకున్నాడు: యువకుడి హల్ చల్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవికి ఉన్నది ఒకే ఒక్క కొడుకు.... మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే శుక్రవారం ఓ యువకుడు నేనే చిరంజీవి పెద్ద కొడుకును అంటూ హెచ్చార్సీని ఆశ్రయించాడు. అతని పేరు సుజిత్ అలియాస్ రవీందర్. కరీంనగర్ జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం వెన్నంపల్లికి చెందిన రవీందర్ చిరంజీవికి తానే పెద్ద కొడుకునని కావాలంటే డీఎన్‌ఏ టెస్టులు చేయాలని అంటున్నాడు.

చిన్న తనంలో పవన్ పవన్ కల్యాణ్ తనను ఎత్తుకునే వాడంటూ రవీందర్ చెప్పుకొచ్చాడు. చిరంజీవి నటించిన పసివాడి ప్రాణం సినిమాలో తాను నటించానని తెలిపాడు. శారీరకంగా ఎదుగుదల లేని కారణంగా తనను వదిలించుకున్నారని మీడియాకు తెలిపారు. చిరంజీవి, సురేఖ దంతపతుల వద్ద తాను ఏడాది పాటు ఉన్నానని, తర్వాత ఇతరులకు అప్పగించారని తెలిపారు. అయితే ఈ అంశం తన పరిధిలో లేనందున హైకోర్టును ఆశ్రయించాలని సూచించిన హెచ్చార్సీ అతని ఫిర్యాదును తిరస్కరించింది.

Chiranjeevi

చిరంజీవి పసివాడి ప్రాణంలో నటించింది అబ్బాయి కాదని, ఆమ్మాయి అని...రవీందర్ రెబుతున్నదంతా అబద్దమే అంటున్నారు ఫ్యాన్స్. నిజంగా అలాంటిదేమైనా ఉంటే ఇన్నాళ్ల నుండి ఈ బాబు ఎక్కడికి వెళ్లాడో...? అంటూ ఫ్యాన్స్ మండి పడుతున్నారు. ఇదంతా పబ్లిసిటీ కోసం ఆడుతున్న డ్రామా అని అంటున్నారు. కొందరైతే అతనికి పిచ్చి పట్టిందని, అందుకే ఇలా ప్రవర్తిస్తున్నాడని అంటున్నారు. చూద్దాం ఇతగాడి వ్యవహారం ఎంత వరకు వెలుతుందో....?

Chiranjeevi
English summary
In what can be termed as absolutely shocking incident, a young man named Sujith alias Ravinder knocked the door of the State Human Rights Commission. He says that he is the eldest son of Chiranjeevi and also acted in Pasivadi Pranam.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu