యువ సంగీత దర్శకుడి ఆత్మహత్య.. ఆలస్యంగా వెలుగులోకి, వేధింపుల వలనే!
షార్ట్ ఫిలిమ్స్ తో ఇప్పుడిప్పుడే సంగీత దర్శకుడిగా ఎదుగుతున్న అనురాగ్ ఆత్మహత్య చేసుకున్నాడు. అనురాగ్ ఆత్మహత్య చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పైగా అతడి మరణంపై అనేక సందేహాలు ఉన్నాయి కూడా. అనురాగ్ వారంరోజుల క్రితమే మరణించినప్పటికీ ఆ విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.
తీవ్ర శోకంలో మునిగిపోయిన అతడి కుటుంబ సభ్యులు ఆత్మహత్యకు సంబంధించిన వివరాలు బయటపెట్టడం లేదు. అతడు ఆత్మహత్యకు పాల్పడింది వికారాబాద్ సమీపంలోని మర్పల్లిలో అని కొందరు అంటుంటే, మరికొందరేమో హైదరాబాద్ లోని నాగోల్ లో మరణించాడని అంటున్నారు.

కొందరినుంచి వేధింపులని తట్టుకోలేక అనురాగ్ ఆత్మహత్య చేసుకున్నాడనే ప్రచారం జరుగుతోంది. ఈ కేసులో వాస్తవాలు ఏమిటో బయటకు రావలసి ఉంది. పలు షార్ట్ ఫిలిమ్స్ లో మ్యుజిక్ డైరెక్టర్ గా తన ప్రతిభ చాటుకున్న అనురాగ్ సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తునాడు. అంతలోనే ఈ ఘోరం జరిగింది.


Click it and Unblock the Notifications











