ఈ రోజు డార్లింగ్ హీరో బర్త్ డే...విష్ చేయండి మరి...!
ఈశ్వర్, రాఘవేంద్ర, వర్షం, చక్రం అడవిరాముడు, ఛత్రపతి, పౌర్ణమి, యోగి, మున్నా, బుజ్జిగాడు, బిల్లా, ఏక్ నిరంజన్, డార్లింగ్" చిత్రాలతో ప్రేక్షకుల అపూర్వ ఆదరాభిమానాలను అందుకొని యంగ్ రెబల్ స్టార్ గా తనదైన స్టైల్ యంగ్ రెబల్ స్టార్ గా తనదైన స్టైల్ లో ఘనవిజయాల్ని సాధిస్తున్న సూపర్ హీరో ప్రభాస్, రెబల్ స్టార్ కృష్ణంరాజు నటవారుసుడిగా, అగ్రనిర్మాత యు.వి సూర్యనారాయణ రాజు తనయుడిగా సీనరంగంలో అడుగు పెట్టిన అతి కొద్దికాలంలోనే హీరోగా ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకొని అందరికీ 'డార్లింగ్" అయ్యాడు ఈ యంగ్ రెబల్ స్టార్. ప్రభాస్ తో ఓ సారి సినిమా చేసిన దర్శకలు చాలా దగ్గర ఫ్రెండ్స్ అయిపోతారు. మళ్ళీ మళ్ళీ ప్రభాస్ తో వర్క్ చేయడానికి ఎదురుచూస్తుంటారు.
అలాగే ప్రభాస్ తో సినిమాలు తీసే నిర్మాతలు మళ్ళీ మళ్ళీ ప్రభాస్ డేట్స్ అడుగుతుంటారు. తనకు బాగా పరిచయం వున్న వాళ్ళందర్నీ 'డార్లింగ్" అని ఆప్యాయంగా పిలిచే అలవాటున్న ప్రభాస్ ప్రస్తుతం దశరథ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. డిసెంబర్ కి పూర్తయ్యే ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో ఓ కొత్త లుక్ తో అందర్నీ అలరించబోతున్న ఈ యంగ్ రెబల్ స్టార్ బర్త్ డే ఈ రోజే (అక్టోబర్ 23)ఈ బర్త్ డే సందర్భంగా ప్రభాస్ కు దట్స్ తెలుగు తరపున శుభాకాంక్షలు తెలుపుతూ..ప్రభాస్ హీరోగా మరిన్ని సంచలన విజయాలు సాధించాలని ఆశిస్తూ దట్స్ తెలుగు...
ప్రభాస్ ప్రస్తుతం హీరోగా దశరథ్ దర్శకత్వంలో 'దిల్" రాజు నిర్మిస్తున్న వర్కింగ్ టైటిల్'మిస్టర్ పర్ ఫెక్ట్" దాదాపు పూర్తి కావచ్చింది. ప్రొస్ట్ ప్రొడక్షన్ వర్క్ త్వరగా పూర్తిచేయుటకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన తాప్సీ, కాజల్ అగర్వాల్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాని 'సంక్రాంతికి" విడుదల చేయాలనుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











