ఆర్ఆర్ఆర్: చిరంజీవిని రిసీవ్ చేసుకున్న రాజమౌళి, ప్రభాస్ రాకతో పులకింత (ఫోటోస్)
ప్రభాస్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భారత చలన చిత్ర రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన సినిమా ఇది. దాని తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న రాజమౌళి..... రూ. 300 కోట్ల బడ్జెట్‌తో మరో భారీ చిత్రాన్ని మొదలు పెట్టారు.
రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ రామారావు, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న ఈచిత్రాన్ని తాత్కాలికంగా ముగ్గురి పేర్లలోని మొదటి అక్షరాలతో 'ఆర్ఆర్ఆర్' అని పిలుస్తున్నారు. సినిమా ప్రారంభోత్సవం ఆదివారం హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి చిరంజీవి క్లాప్ కొట్టారు

రాజమౌళి డార్లింగ్ కోసమే
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రభాస్ కూడా రావడంతో అక్కడ అంతా సందడి వాతావరణం నెలకొంది. ప్రభాస్ ఎంట్రీ ఇవ్వగానే రాజమౌళి, ఆయన భార్య రమ పులకించి పోయారు. డార్లింగ్‌ను హగ్ చేసుకుని ఆనంద పడిపోయిన దృశ్యం అందరినీ ఆకట్టుకుంది.

రామ్ చరణ్‌తో ప్రభాస్
ఆర్ఆర్ఆర్ మూవీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రామ్ చరణ్‌తో కలిసి ప్రభాస్. ఈ ఇద్దరూ కలిసి ఒకే ఫంక్షన్లో కనిపించిన సందర్భాలు చాలా తక్కువ. ఇన్నాళ్లకు ‘ఆర్ఆర్ఆర్' ప్రారంభోత్సవం సందర్భంగా ఇద్దరూ ఒకే ఫ్రేములో కెమెరాకు చిక్కారు.

ప్రభాస్, రానాతో రాజమౌళి
బాహుబలి సినిమా దాదాపు ఐదేళ్ల పాటు సాగింది. ఈ ఐదేళ్లు రాజమౌళి, ప్రభాస్, రానా కలిసి పని చేశారు. ఆ రోజులను గుర్తు చేసుకుంటూ ముగ్గురూ ఆనందంలో మునిగి పోయిన క్షణాలను ఈ ఫోటోలో చూడొచ్చు.

ప్రభాస్
ఎలాంటి కల్మషం లేకుండా అందరి మంచి కోరే వ్యక్తిగా ప్రభాస్‌కు ఇండస్ట్రీలో పేరుంది. బాహుబలి తర్వాత రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటూ ప్రారంభోత్సవ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు యంగ్ రెబెల్ స్టార్.

చిరును రిసీవ్ చేసుకున్న రాజమౌళి
మెగాస్టార్ చిరంజీవి వస్తున్న విషయం తెలియగానే రాజమౌళి పరుగుపరుగున వెళ్లి ఆయన్ను మర్యాద పూర్వకంగా రిసీవ్ చేసుకుని ప్రారంభోత్సవ వేదిక వద్దకు తీసుకొచ్చారు.

అరుదైన సన్నివేశం
మెగాస్టార్ చిరంజీవి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలసిన అరుదైన సందర్భాల్లో ఇదీ ఒకటి. చిరంజీవి ప్రారంభోత్సవ వేడుక వద్దకు రాగానే ఎన్టీఆర్ మర్యాద పూర్వకంగా ఆయన్ను విష్ చేస్తూ కరచాలనం చేశారు.

ఆర్ఆర్ఆర్ అంటే ఇదే
ఈ ప్రాజెక్టును ప్రస్తుతానికి ‘ఆర్ఆర్ఆర్' అని పిలుస్తున్నారు. దీని అర్థం రాజమౌళి, రామారావు, రామ్ చరణ్ అని.... త్వరలోనే ఈ చిత్రానికి టైటిల్ ప్రకటించనున్నారు.


Click it and Unblock the Notifications











