‘వారధి’ రెంగ్యులర్ షూటింగ్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్

By Sindhu

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్-కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమా ఇటీవలే అక్టోబర్ 17న సినిమా ముహూర్తం జరిగిన విషయం విధితమే. ఈ సినిమాకి "వారధి" అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ చిత్రం రెగ్యులర్ ష్యూటింగ్ నిన్న హైదరాబాదులోని పోలీసు అకాడెమీలో ఈ సినిమా మొదటి రోజు షూటింగ్ ప్రారంభినట్లు విశ్వనీయ వర్గాల సమాచారం.

పూర్తి కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన అనుష్క మరియు రిచా గంగోపాధ్యాయ నటిస్తున్నారు. బిల్లా తర్వాత అనుష్క-ప్రభాస్ జంటగా 'వారధి" కోసం రెండో సారి జతకడుతున్నారు. మిరపకాయ్ సినిమా తర్వాత అవకాశాలు లేని రిచా గంగోపాద్యాయ రెండవ హీరోయిన్ గా నటించనుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ తో యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వి. వంశీ కృష్ణా రెడ్డి మరియు ప్రమోద్ ఉప్పలపాటి నిర్మిస్తున్నారు.

కొరటాల గతంలో భద్ర, మున్నా, బృందావనం, ఊసరవెల్లి వంటి పలు చిత్రాలకు డైలాగ్స్ అందించారు. ఈ సినిమాతో డైరెక్టర్ గా మారబోతున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ లారెన్స్ డైరెక్షన్లో 'రెబల్" అనే సినిమా చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X