ప్రభాస్ ‘మిర్చి’ ఆడియో రిలీజ్ డేట్ ఖరారు

By Bojja Kumar

హైదరాబాద్ : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా సినిమా 'మిర్చి' ఆడియో విడుదల తేదీ ఖరారైంది. ఈ చిత్రం ఆడియోను డిసెంబర్ 10న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా వేదిక ఎక్కడ అనేది ఖరారు కావాల్సి ఉంది. మరో వైపు ఆడియో ఫంక్షన్ ఎంట్రీ పాసులు దక్కించుకునేందకు ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టారు.

ఈ మేరకు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమాన సంఘాలు తమ తమ ప్రయత్నాలు మొదలు పెట్టాయి. గతంలో 'రెబల్' ఆడియో సందర్భంగానే భారీ సంఖ్యలో అభిమానులు తరలి రాగా చాలా మంది పాసులు దొరక్క వెనుదిరిగి వెళ్లి పోయారు. ఈ సారి కూడా అలాంటి పరిస్థితే రిపీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరో వైపు ఈ నెల 18న 'మిర్చి' టీజర్ విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 'రెబల్' చిత్రం ఆశించిన ఫలితాలు ఇవ్వక పోవడంతో ఇటు ప్రభాష్ తో పాటు అటు అభిమానులు కూడా మిర్చి చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రం తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకంతో ఉన్నారు.

ఈ చిత్రంతో రచయిత కొరటాల శివ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. వి.వంశీకృష్ణ, ప్రమోద్‌ ఉప్పలపాటి నిర్మాతలు. యు.వి.ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనుష్క, రిచా గంగోపాధ్యాయ హీరోయిన్స్. ప్రభాస్ అభిమానులు కోరుకునే అన్ని కమర్షియల్ అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X