పేపర్ బాయ్‌కి ప్రభాస్ ప్రశంస.. ట్రైలర్ చూసిన యంగ్ రెబల్‌స్టార్
సంపత్ నంది నిర్మాణ సారథ్యంలో రూపొందుతున్న పేపర్ బాయ్ చిత్రంపై విడుదలకు ముందే మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ చిత్రం ద్వారా దివంగత దర్శకుడు శోభన్ కుమారుడు సంతోష్ శోభన్ తెలుగు చిత్రసీమకు పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రం ఆగస్టు 31న రిలీజ్ కానున్నది. ఈ నేపథ్యంలో పేపర్ బాయ్ చిత్ర టీజర్‌ను యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ సోమవారం చూశారు. ఈ చిత్ర టీజర్ తనను ఆకట్టుకొన్నదని పేర్కొన్నాడు.
పేపర్ బాయ్ చిత్రం ప్రేక్షకాదరణ పొంది సంతోష్ శోభన్‌కు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. గతంలో ప్రభాస్ నటించిన వర్షం చిత్రానికి శోభన్ దర్శకత్వం వహించారు. ఆ చిత్రం ప్రభాస్ కెరీర్‌లో తొలి బ్లాక్ బస్టర్ కావడం విశేషం.

జయశంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న పేపర్ బాయ్ చిత్రాన్ని దర్శకుడు సంపత్ నంది నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సంతోష్ శోభన్ సరసన రియా సుమన్, తన్యా హోప్ హీరోయిన్లుగా నటించారు.

పేపర్ బాయ్ చిత్ర పంపిణీ హక్కులను గీతా ఆర్ట్స్ సొంతం చేసుకొన్నది. అల్లు అరవింద్, బన్నీవాసు ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











