మరో అశ్వినీదత్ గా పేరు తెచ్చుకుంటున్నయంగ్ ప్రొడ్యూసర్...!
హాస్యనటుడు గణేష్ బాబు ఆర్టిస్టుగా కంటే నిర్మాతగా బాగా సక్సెస్ అయ్యేలా కనిపిస్తున్నాడు. పెద్ద హీరోలతో ఒకరి తర్వాత మరొకరితో సినిమాలు నిర్మించడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ హీరోగా జయంత్ దర్శకత్వంలో 'తీన్ మార్' సినిమాని నిర్మిస్తున్న గణేష్ తన తదుపరి చిత్రాన్ని యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో తీయడానికి ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలెట్టాడు.
ఈ సినిమాకి శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తాడు. ప్రస్తుతం శ్రీను వైట్ల మహేష్ బాబుతో 'దూకుడు" చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. జూ ఎన్టీఆర్, శ్రీను ల కాంబినేషన్ లో వస్తున్న తొలి చిత్రం కాబట్టి, దీనికి ఇప్పటి నుంచే ట్రేడ్ వర్గాలలో క్రేజ్ మొదలైంది. ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ లైన్ ఒకే అయిందనీ, ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందనీ చెబుతున్నారు. ఇలా పెద్ద కాంబినేషన్లలో వెంట వెంటనే సినిమాలు నిర్మిస్తూ, గణేష్ బాబు మరో అశ్వినీదత్ గా టాలీవుడ్ లో పేరు తెచ్చుకుంటున్నాడు!


Click it and Unblock the Notifications











