జూ ఎన్టీఆర్ కి ఆ విషయంలో తొందరపెడుతున్నాడా..!?
జూ ఎన్టీఆర్ కి ఒక్కసారిగా పెళ్లి చేసుకోవాలనే మూడొచ్చేసింది. నిశ్చితార్థం చేసుకుని తొమ్మిది నెలలు దాటినా నార్నే వారమ్మాయి ఇంకా నందమూరి వారి కోడలు కాకపోవడంతో, ఎక్కడో తేడా కొడుతోందంటూ వెబ్ సైట్లు ప్రశ్నార్థకాలు, ఆశ్ఛర్యార్థకాలు పెట్టడం మొదలు పెట్టాయి. ఇంతకాలం పెళ్లి విషయంలో ఎలాంటి తొందరలేకుండా ఉన్న జూ ఎన్టీఆర్ ఇప్పుడు ఒక్కసారిగా వేగం పెంచాడు.
తను తాత్సారం చేస్తుంటే జనాలు ఏమనుకుంటున్నారో తెలిసే సరికి తొందరపడుతున్నాడు. అందుకే పెళ్ళి ఎట్టి పరిస్థితుల్లోనూ త్వరలో జరిగిపోవాలని అర్ఢరేశాడు. ఇద్దరి జాతకాలకీ సరిపోయే ముహూర్తాన్ని మే 7న ఫిక్స్ చేశారు. ఇక పెళ్ళి న్యూస్ బయటకు వచ్చేసింది కాబట్టి జూ ఎన్టీఆర్ వివాహ విషయంలో అనుమాలన్నీ పటాపంచలైపోయాయి. ఇక పెళ్ళి బాజా మోగడమే తరువాయి.
జూ ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతీ శక్తి ఇలియానా మొహర్ రమేష్ అశ్విని దత్ jr ntr lakshmi pranathi shakti ileana mehe ramesh ashwini dutt


Click it and Unblock the Notifications