క్యూలో నిలబడి ఓటు వేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. బాబోయ్.. ఏంటా గడ్డం(ఫోటోలు)!

Recommended Video

Telangana Elections 2018 LIVE Updates : Jr NTR And His Family Cast Their Vote | Oneindia Telugu

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోలాహలం కనిపిస్తోంది. ప్రజలంతా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ కడుతున్నారు. రాజకీయ సినీ ప్రముఖులంతా ఓటు వేయడానికి తరలి వెళుతున్నారు. నిన్నటి నుంచి సోషల్ మీడియా మోతెక్కిపోతోంది. హక్కులని కాపాడుకునేందుకు, దేశాన్ని అభివృదిలో నడిపించేందుకు ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని సినీ సెలెబ్రిటీలంతా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన ఓటు హక్కుని వినియోగించుకున్నాడు.

సినీ ప్రముఖులంతా

సినీ ప్రముఖులంతా

మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, నితిన్, నాగార్జున, అమల, రాజమౌళి, డైరెక్టర్ గోపీచంద్ మలినేని లాంటి సినీ ప్రముఖులంతా ఉదయాన్నే వారి ఓటు హక్కుని వినియోగించుకున్నారు. రాజమౌళి, కొరటాల శివ నిన్ననే ట్విట్టర్ వేదికగా అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరిన సంగతి తెలిసిందే. సినిమా సెలెబ్రిటీలు రావడంతో పోలింగ్ కేంద్రాల వద్ద సందడి నెలకొంది. కానీ ఎంటువంటి అలజడి జరగకుండా ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.

కుటుంబ సమేతంగా క్యూలో నిలబడి

కుటుంబ సమేతంగా క్యూలో నిలబడి

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కుటుంబ సమెంతంగా జూబ్లీ హిల్స్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేసారు. ఎన్టీఆర్ తో పాటు సతీమణి లక్ష్మి ప్రణతి, తల్లి షాలిని క్యూలో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేసిన తరువాత మీడియాకు చేతివేలి ఉన్న సిరాన్ని చూపిస్తూ అభివాదం చేశారు.

విభిన్నమైన పాత్రల్లో

విభిన్నమైన పాత్రల్లో

ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శత్వంలో ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, రాంచరణ్ కలసి నటిస్తున్న ఈ చిత్రం భారీ మల్టీస్టారర్ గా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ బందిపోటుగా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాంచరణ్ బ్రిటిష్ కాలం నాటి పోలీస్ వేషధారణలో కనిపిస్తాడట. స్వాతంత్ర పోరాట నేపథ్యంలో ఏ చిత్రం సాగుతుందని వార్తలు వస్తున్నాయి.

 ఏంటా గడ్డం

ఏంటా గడ్డం

ఎన్టీఆర్ ఈ చిత్రం కోసం భారీగా బరువు పెరుగుతున్నాడంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. కానీ తాజాగా పోలింగ్ కేంద్రం వద్ద ఎన్టీఆర్ సాధారణ బరువుతోనే కనిపించాడు. కానీ గడ్డం మాత్రం బాగా పెంచేస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ ని గుబురు గడ్డంతో చూడబోతున్నట్లు అర్థం అయిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X