సినిమా నచ్చలేదా..టిక్కెట్టు డబ్బు వాపస్
తమ సినిమా చూసి వేస్ట్ ఆప్ టైమ్ అనుకుంటే తాను టిక్కెట్టు డబ్బు వెనక్కి ఇవ్వటానికి రెడీ అని ప్రకటించాడు సంగీత దర్శకుడు విశాల్ దడ్లోని. ఆయన తాజాగా చేసిన అల్లాధీన్ అనే చిత్రం ఈ రోజు(శుక్రవారం)రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా ఈ కామెంట్స్ చేసారు. అయితే ఈ టిక్కెట్ డబ్బు తిరిగి ఇచ్చే స్కీమ్ కేవలం మొదటి వంద మంది నచ్చని ప్రేక్షకులకేనట. ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మించిన ఈ 'అల్లాద్దీన్' చిత్ారంలో అమితాబ్ బచ్చన్, సంజయ్‌దత్, రితేశ్ దేశ్‌ముఖ్ నటించారు.సుజయ్ ఘోష్ దర్శకత్వం వహించారు.
అలాగే ఈ చిత్రం చిన్నపిల్లల్ని టార్గెట్ చేసుకుని ఫాంటసీ అంశాల్ని మిళితం చేసి రూపొందించారు. కథ విషయానికొస్తే...ఖ్వైష్ అనే పట్టణంలో అల్లాద్దీన్ ఛటర్జీ నివాసం ఉంటాడు. అనాథగా పెరుగుతున్న ఇతనికి ఖాసిం ముఠాతో సంబంధాలు ఉంటాయి. అతని జీవితంలో జాస్మిన్ రాక ఎంతో మార్పు తెస్తుంది. ఆమె అల్లాద్దీన్‌కి ఇచ్చే అద్భుత దీపం ఏ అద్భుతాలు సృష్టించింది? జీనీ మాజీ రింగ్‌మాస్టర్ అల్లాద్దీన్‌ను ఎందుకు చంపాలనుకొంటాడు? ఇలాంటి ఆసక్తికరమైన అంశాలన్నీ 'అల్లాద్దీన్'లోనే చూడాలంటున్నారు దర్శక,నిర్మాతలు. ఇది ప్రక్కన పెడితే ఇలాంటి మనీ రిఫెండ్ పాలసీ మన తెలుగు సినిమాలకు కూడా పెడితే బావుంటుంది..కదా. నచ్చని ప్రేక్షకుడుకు మ్యాన్యుఫాక్టరింగ్ గ్యారెంటీ ఇచ్చినట్లు ఉంటుంది. అయితే ప్రేక్షకుడు నిజాయితీగా తనకి నచ్చిందో లేదో అన్నది క్లారిఫై ఇవ్వాలి.


Click it and Unblock the Notifications











