»   » నీ విజయం అందరికీ స్పూర్తి, హాట్సాఫ్: తంగవేలుపై రజనీ, ప్రభాస్ ప్రశంస

నీ విజయం అందరికీ స్పూర్తి, హాట్సాఫ్: తంగవేలుపై రజనీ, ప్రభాస్ ప్రశంస

Posted By:
Subscribe to Filmibeat Telugu

రియో: రియోలో జరుగుతున్న పారాలింపిక్స్‌లో హై జంప్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించి మువ్వనెల జెండాను రెపరెపలాడించి, దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసిన మరియప్పన్ తంగవేలును టాలీవుడ్ టాప్ హీరో ప్రభాస్ పొగడ్తలతో ముంచెత్తారు. తంగవేలు విజయం.. ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని ప్రభాస్ అన్నారు.

''ఐదేళ్ల వయసులో రోడ్డు ప్రమాదంలో కాలు చితికిపోయినా.. సాధించాలన్న తపన, గెలవాలన్న కసితో 21 ఏళ్ల వయసులో పారాలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన తంగవేలుకు హాట్సాఫ్'' అంటూ సోషల్‌మీడియాలో ప్రభాస్ పోస్ట్ చేశారు.

మారియప్పన్ తంగవేలు కు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ట్వీట్ చేశారు. పురుషుల లాంగ్ జంప్ విభాగంలోనే కాంస్య పతకం సాధించిన భారత్ క్రీడాకారుడు వరుణ్ భాటికీ కూడా ఇదే ట్వీట్ లో అభినందనలు తెలిపారు.

మిళనాడుకు చెందిన మరియప్పన్‌ తంగవేలుది సేలంలోని పెరియవడగంపట్టి అనే చిన్న పల్లెటూరు. మద్రాసుకు 340 కిమీ దూరంలోని ఈ గ్రామంలో తంగవేలు పుట్టిపెరిగాడు. ఐదేళ్ల వయసులో మరియప్ప ఆడుకుంటూ ఉండగా.. రాష్ట్ర రవాణా సంస్థకు చెందిన బస్సు అతడి కాలిపై నుంచి వెళ్లింది. ఈ ప్రమాదంలో మరియప్పన్‌ కుడి కాలు చితికిపోయింది.

తన వైకల్యాన్ని అధిగమనించి తంగవేలు మొక్కవోని దీక్షతో రియోలో తస్తా చాటారు. భారత త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు. ఇదే విభాగంలో వరుణ్ భాటి బ్రాంజ్ మెడ్ సాధించడం విశేషం.

English summary
"M. Thangavelu, your win is an inspirational story for everyone.. Hats off to you on your gold medal at the Para Olympics." Prabhas said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu