శృంగార రసం బాగా దట్టించారు, యూత్ ఫుల్లుగా..(ఫోటోస్)
హైదరాబాద్: చిన్న సినిమాల దర్శక నిర్మాతలు యూత్ ను ఆకట్టుకోవడానికి పబ్లిసిటీ ఓ రేంజిలో చేస్తున్నారు. తెలుగులో తెరకెక్కుతున్న 'యూత్‌ఫుల్ లవ్' అనే చిత్రం ప్రచార పోస్టర్లు చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. సినిమాల్లో ఏముందో తెలియదు కానీ...పోస్టర్లలో మాత్రం శృంగార రసం బాగా దట్టించి రిలీజ్ చేసారు.
యూత్‌ఫుల్ లవ్ చిత్రంలో మనోజ్‌నందం, ప్రియదర్శిని జంటగా నటిస్తున్నారు. నవీన్ క్రియేషన్స్ పతాకంపై రాధారం రాజలింగం నిర్మిస్తున్న ఈ చిత్రానికి వేముగంటి దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టులో విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలు...యూత్‌ను ఆకట్టుకునే విధంగా విడుదల చేసిన హాట్ ఫోటోలు స్లైడ్ షోలో....

నిర్మాత మాట్లాడుతూ...
నిర్మాత చిత్ర విశేషాలు తెలియజేస్తూ సందేశాత్మక ప్రేమకథా చిత్రమిది. యువతకు చదువుతో పాటు మార్షల్స్ ఆర్ట్స్ కూడా అవసరమే అనే అంశాన్ని వినోదాత్మకంగా చూపించే ప్రయత్నం చేస్తున్నామన్నారు.

కాన్సెప్టు ఏమిటంటే...
డబ్బున్న యువకుడి ప్రేమకు, ఓ పేదవాడి ప్రేమకు మధ్యవున్న వ్యత్యాసమేమిటి అనే విషయాన్ని దర్శకుడు ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. సున్నితమైన భావోద్వేగాల మేళవింపుతో రూపొందిన ఈ చిత్రం ఇంటిల్లిపాదినీ ఆకట్టుకునే విధంగా వుంటుందన్నారు నిర్మాత.

సినిమాలో హైలెట్
పోరాట సన్నివేశాలు హాలీవుడ్ చిత్రాల తరహాలో సాగుతాయి. మనోజ్‌నందం నటన, ప్రియదర్శిని గ్లామర్ ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయని నిర్మాత తెలిపారు.

ముద్దు సీన్లు
పోస్టర్లలో హీరో-హీరోయిన్స్ మధ్య లిప్ లాక్ ఫోటో ఈ సినిమాలో మసాలా సీన్లకు కొదవేమీ లేదని చెప్పకనే చెబుతుంది.

ఆడియో విడుదలైంది
ఈ చిత్రానికి సంబంధించి ఆడియో 2013 నవంబర్లోనే విడుదలైంది.

ఆలస్యంగా విడుదల...
వివిధ కారణాలతో సినిమా చాలా కాలంగా విడుదలకు నోచుకోలేదు. అన్ని చిన్న సినిమాల్లానే ఈచిత్రాన్ని కూడా థియేటర్ల సమస్య ఇన్నాళ్లు ఇబ్బంది పెట్టింది.


Click it and Unblock the Notifications











