»   » వావ్..! నితిన్ లై టీజర్ ఇదే, అదిరిపోయింది

వావ్..! నితిన్ లై టీజర్ ఇదే, అదిరిపోయింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

యూత్‌స్టార్‌ నితిన్‌ కథానాయకుడిగా వెంకట్‌ బోయనపల్లి సమర్పణలో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై హను రాఘవపూడి దర్శకత్వంలో రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మిస్తున్న భారీ చిత్రం 'లై' (లవ్‌ ఇంటెలిజెన్స్‌ ఎనిమిటి). హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర టీజర్‌ను మంగళవారం విడుదల చేశారు.

 అశ్వ‌త్థామ‌ హతః కుంజరః

అశ్వ‌త్థామ‌ హతః కుంజరః

అర్జున్‌ ఈ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. 'కోట్లమంది సైనికులు సరిపోలేదట. పంచ పాండవులూ సాధించలేదట. చివరికి కృష్ణుడూ ఒంటరి కాదట. అబద్ధం తోడు లేకుండా ఏ కురుక్షేత్రం పూర్తవదట. అశ్వ‌త్థామ‌ హతః కుంజరః' అంటూ సాగిన టీజర్‌లోని డైలాగ్‌లు సినిమాపై ఇంట్రెస్ట్‌ను కల్పిస్తున్నాయి.

నితిన్ ఏంటీ... ఇలా ఉన్నాడు..!?? అస్సలు గుర్తుపట్టలేం

పాజిటివ్ టాక్ తో

పాజిటివ్ టాక్ తో

అబద్ధం లేకుండా ఏ కురుక్షేత్రం పూర్తి కాలేదు అన్న ఒక్క మాటతోనే మంచి ఇంప్రెషన్ కలిగించేసాడు దర్శకుడు హను రాఘవపూడి తన లేటెస్ట్ సినిమా లై మీద. నితిన్ ను కొత్తగా చూపిస్తూ, తయారవుతున్న ఈ సినిమా టీజర్ విడుదలయింది. వచ్చీ రావటమే పాజిటివ్ టాక్ తో దూసుకు పోతోంది.

యాక్షన్ ఎంటర్‌టైనర్‌

యాక్షన్ ఎంటర్‌టైనర్‌

యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ సినిమాలో అర్జున్ కీలకపాత్రలో నటిస్తున్నాడు. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపిఆచంట, అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ మ్యూజిక్ డైరెక్టర్. మేఘా ఆకాశ్ నితిన్‌కు జోడీగా నటిస్తున్నది.

మణిశర్మ రీ రికార్డింగ్

మణిశర్మకు రీ రికార్డింగ్ లో మాంచి టాలెంట్ వుంది. అది టీజర్ లోనే తొంగిచూసింది. నితిన్ కొత్తగానే కాదు అందంగా కూడా కనిపించాడు. ప్రేమ‌, తెలివితేట‌లు, శ‌త్రుత్వం అంశాల చుట్టూ తిరిగే ఈ క‌థ‌ను గ్రాండ్‌గా తీసిన‌ట్టు టీజ‌ర్‌లో క‌నిపిస్తోంది. గ‌డ్డంతో క‌నిపిస్తున్న నితిన్ గెట‌ప్‌, విల‌న్‌గా అర్జున్ లుక్‌కి ఇప్ప‌టికే మంచి మార్కులు ప‌డ్డాయి.

English summary
The teaser of Lie is out and it is slick and captivating. Stylish action cuts and the dialogue make it an attention grabbing teaser.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu