»   » ఫేక్ అని తేల్చిన యూట్యూబ్, మహేష్ బాబుపై కుట్ర?

ఫేక్ అని తేల్చిన యూట్యూబ్, మహేష్ బాబుపై కుట్ర?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మహేష్ బాబు తాజా సినిమా '1(నేనొక్కడినే)'కు సంబంధించిన టీజర్‌ను ఇటీవల యూట్యూబ్ తన వెబ్ సైట్ నుంచి రిమూవ్ చేసిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు బర్త్‌డే సందర్భంగా విడుదలైన ఈ టీజర్ యూట్యూబులో రికార్డు స్థాయి హిట్స్ సొంతం చేసుకుంది. అయితే ఇవన్నీ ఫేక్ హిట్స్ అని తేలడంతో యూట్యూబ్ ఈ టీజర్‌ను తన వెబ్‌సైట్ తొలగించింది.

ఈ పరిణామంతో షాకైన 1(నేనొక్కడినే)టీం మళ్లీ వీడియోను రీస్టోర్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే యూట్యూబ్ మాత్రం ఇందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. కెన్యాలోని ఓ సైబర్ మాఫియా ఈ ఫేక్ హిట్స్‌కు మూల కారణమని యూట్యూబ్ కనిపెట్టింది. ఫేక్ హిట్స్ ఉన్నందున వీడియోను రీస్టోర్ చేయడం కుదరదని స్పష్టం చేసినట్లు సమాచారం.

కాగా...చిత్ర నిర్మాతలు ఇప్పటికే ఈ విషయమై సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసారు. మహేష్ బాబు ఇమేజ్‌పై దెబ్బకొట్టేందుకు ఎవరో కుట్రపన్ని ఈ పని చేయించినట్లు అభిమానులు అనుమానిస్తున్నారు. గత కొంత కాలంగా మహేష్ బాబుపై ఓ వర్గం ఇంటర్నెట్లో దుష్ర్పచారం చేస్తుండటం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది.

14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ ప్రై.లి పతాకంపై 'దూకుడు' లాంటి బ్లాక్ బస్టర్ హిట్‌ని నిర్మించిన రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర తాజాగా సుకుమార్ దర్శకత్వంలో '1(నేనొక్కడినే) చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈచిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.

మహేష్ సరసన కృతి షానన్ నటిస్తోంది. సాయాషి షిండే, కెల్లీ దోర్జి, విక్రం సింగ్, శ్రీనివాస రెడ్డి, నాజర్, ప్రదీప్ రావత్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంలో ఆచంట రామ్, ఆచంట గోపీచంద్, అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ : రత్నవేలు, సంగీతం : దేవిశ్రీప్రసాద్, కళ : రాజీవన్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఫర్వేజ్ ఫిరోజ్, కెచ్చా, ఎడిటింగ్: కార్తిక శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కోటి పరుచూరి, నిర్మాతలు : రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : సుకుమార్.

English summary
There is also a intresting news from Youtube that they removed Mahesh Babu's "1-NENOKKADINE" video because they observerd many fake hits from Kenya where a big mafia will run on creating fake hits.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu