బట్టబయలయిన యూట్యూబ్ స్టార్ భాగోతం.. మైనర్ బాలిక రేప్.. అరెస్ట్ !

ఈ మధ్య కాలంలో వరుసగా సోషల్ మీడియా స్టార్లు వివాదంలో చిక్కుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం యూట్యూబ్ స్టార్ట్ షణ్ముఖ్ జస్వంత్ తాగి కారు నడుపుతూ కొందరిని ఢీకొన్న సంగతి తెలిసిందే. ఈ అంశం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో కాస్త క్రేజ్ రాగానే దాన్ని చూసుకుని కొంతమంది ఇలా ప్రవర్తిస్తున్నారు అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా విమర్శలు వినిపించాయి. తాజాగా మరో స్టార్ కూడా అదే బాటలో పయనిస్తూ ఇప్పుడు ఏకంగా అరెస్టయి జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది..

ఫన్ బకెట్ తో ఫేమస్ అయ్యి !

ఫన్ బకెట్ తో ఫేమస్ అయ్యి !

ఆ స్టార్ మరెవరో కాదు ఫన్ బకెట్ భార్గవ్ పేరుతో సోషల్ మీడియా లో ఫేమస్ అయిన చిప్పడ భార్గవ్. విశాఖపట్నం కొత్తవలసకు చెందిన ఈ యువకుడు కొన్నేళ్ల క్రితం సినిమాలో రాణించాలనే కోరికతో హైదరాబాద్ వచ్చాడు. అలా వచ్చిన కొత్తలో ఒక యూట్యూబ్ ఛానల్ లో మొదలైన ఫన్ బకెట్ అనే కామెడీ సిరీస్ లో అవకాశం దక్కించుకుని దాని ద్వారా ఫేమస్ అయ్యాడు. ఎంతగా ఫేమస్ అయ్యాడు అంటే దాని ద్వారా కొన్ని సినిమాల్లో చిన్న చిన్న అవకాశాలు సైతం ఆయనకు వచ్చాయి. అయితే దీని ద్వారా ఆదాయం తగ్గిపోవడంతో అప్పుడే మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన టిక్ టాక్ అనే యాప్ ద్వారా సంపాదించడం మొదలు పెట్టాడు.

 మాటీవీ ప్రోగ్రాంలో సైతం !

మాటీవీ ప్రోగ్రాంలో సైతం !

అప్పటిదాకా హైదరాబాద్ కేంద్రంగా సినిమాల్లో ప్రయత్నాలు చేసిన ఈ యువకుడు. టిక్ టాక్ లో సంపాదన బాగుందని తెలియడంతో వెంటనే తన సొంత ఊరికి మార్చాడు. అక్కడ తన స్నేహితులను కొంతమందిని పోగుచేసి టీమ్ భార్గవ్ పేరుతో వీడియోలు చేయడం మొదలు పెట్టాడు. అలా ఆ వీడియోలు చేస్తూ సంపాదిస్తూ వచ్చిన క్రేజ్ తో కొన్ని ప్రమోషన్స్ చేస్తూ ఎలాగోలా నెట్టుకొస్తున్నాడు. ఇక పెరుగుతున్న కాంపిటీషన్ లో భాగంగా ఈ టీవీ మాటీవీ లాంటి సంస్థలు సైతం సోషల్ మీడియా లో ఫేమస్ అయిన వారిని తమ తమ కార్యక్రమాలలో చూపడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగానే భార్గవ్ కు కూడా మా టీవీ తరపున కామెడీ స్టార్స్ అనే ప్రోగ్రాంలో పాల్గొనే అవకాశం దక్కింది. అలా ప్రస్తుతానికి ఒక అక్కడ యాప్ లో వీడియోలు చేసుకుంటూ మరో పక్క ఇలాంటి ఈవెంట్స్ చేస్తూ భార్గవ్ బాగానే సంపాదిస్తున్నాడు.

Recommended Video

Jr.NTR Sons Christmas Celebrations, Cute Photos Gone Viral
 మైనర్ బాలిక రేప్

మైనర్ బాలిక రేప్

ఇదంతా ఇలా ఉంటే మరో పక్కన ఆయన మీద ఒక 14 ఏళ్ల మైనర్ బాలిక తల్లి రేప్ కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది. అందుతున్న సమాచారం మేరకు విశాఖపట్నం జిల్లాకు చెందిన ఒక మైనర్ బాలిక కు భార్గవ్ తో ఆన్లైన్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే భార్గవ్ తో ఆమె టిక్ టాక్ వీడియోలు చేయడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ముందు అన్నా చెల్లెలు గా పిలుచుకునే వీరి మధ్య చనువు పెరిగింది అని, ఆ చనువు పెరిగిన నేపథ్యంలో భార్గవ్ ఆమెను శారీరికంగా లొంగ తీసుకున్నాడని సమాచారం. ప్రస్తుతం ఆమెకు నాలుగో నెల గర్భం అని తేలడంతో సదరు బాలిక తల్లి విశాఖపట్నంలో ఉన్న దిశ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసింది. కేసు నమోదు చేయడంతో భార్గవ్ ను అరెస్టు చేసిన పోలీసులు మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. పోక్సో చట్టం మీద ఆయనను అరెస్ట్ చేసినట్లు సమాచారం. మెజిస్ట్రేట్ భార్గవ్ కు వచ్చే నెల మూడో తారీకు వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో భార్గవ్ ను జైలు కు తరలించినట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X