Youtuber Harsha Sai: రేప్ కేసుపై నోరు విప్పిన హర్షసాయి.. ఇంతకీ ఏమన్నారంటే?

Youtuber Harsha Sai: తెలుగు సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు వరుసగా వెలువడుతాయి. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వివాదం పూర్తికాక ముందుకే మరో వివాదం వెలుగులోకి వచ్చింది. ఈ సారి యూట్యూబర్, నటుడు హర్షసాయిపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. హర్ష తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ఓ యువతి ఆరోపించింది. ఈ విషయాన్ని నార్సింగ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంపై యూట్యూబర్, నటుడు హర్షసాయిపై తొలిసారి స్పందించారు. ఇంతకీ ఏమన్నారంటే?

ప్రముఖ యూట్యూబర్ హర్షసాయిపై లైంగిక వేధింపులు, చీటింగ్, బ్లాక్ మెయిల్ కేసు నమోదైంది. నార్సింగి పోలీసులకు బాధిత యువతి ఫిర్యాదు చేసిన ప్రకారం.. ప్రేమ, పెళ్లి పేరుతో తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని, తనకు మత్తు ఇచ్చి తన నగ్నచిత్రాలను తీశాడని ఆరోపించింది. అంతేకాకుండా.. వాటిని అడ్డుపెట్టుకుని బ్లాక్‌మెయిల్‌ చేశాడని, ఈ క్రమంలో పెద్ద ఎత్తున్న డబ్బు గుంజాడని ఫిర్యాదులో పేర్కొన్నది. తన అడ్వకేట్ సహయంతో వచ్చి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Youtuber Harsha Sai booked for rape and blackmailing recently Harsha Sai Instagram Post viral

అయితే బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు రేప్ కేసు నమోదు చేశారు. హర్షసాయి తన అసభ్య వీడియోలతో బెదిరించాడని ఫిర్యాదు చేయడంతో అతడిపై కేసు పెట్టాం. ఐపీసీ 376, 354 సెక్షన్ల కింద కేసు పెట్టామని రాజేంద్ర నగర్ డీసీపీ శ్రీనివాస్ మీడియాకు వెల్లడించారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

ఇదెలా ఉంటే.. యూట్యూబ‌ర్ హ‌ర్ష‌సాయి కేసులో మరో ట్విస్ట్‌ వెలుగులోకి వచ్చింది. మెగా సినిమా కాపీరైట్స్ కోసమై వివాదమనీ, సినిమాకు ప్రొడ్యూస‌ర్‌గా బాధితురాలు వ్య‌వ‌హ‌రించినట్టు తెలుస్తోంది. ఆమెకు మ‌త్తుమందు ఇచ్చి పలుమార్లు హర్షసాయి అఘాయిత్యానికి పాల్ప‌డినట్టు తెలుస్తోంది. ఈ కేసు నమోదైనప్పటి నుంచి హర్ష అందుబాటులో లేకుండా పోయాడు. అతడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.

Youtuber Harsha Sai booked for rape and blackmailing recently Harsha Sai Instagram Post viral

తాజాగా తనపై ఆరోపణలపై యూట్యూబర్, నటుడు హర్షసాయిపై తొలిసారి స్పందించారు. హర్షసాయి తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ పోస్ట్ చేస్తూ..'అవన్నీ తప్పుడు ఆరోపణలు. డబ్బులు కోసమే నాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. నా గురించి మీకు తెలుసు. నిజానిజాలు త్వరలో బయటకు వస్తాయి. మా న్యాయవాది తానికొండ చిరంజీవి ద్వారా త్వరలో అన్ని విషయాలను మీ ముందుకు తీసుకవస్తా..' అని హర్షసాయి పేర్కొన్నాడు.ఈ ప్రస్తుతం ఆ ట్వీట్ నెట్టింట్లో తెగ వైరలవుతోంది.

విశాఖకు చెందిన హర్షసాయి తన యూట్యూబ్ ఛానెల్‌లో పలు వీడియోలు అప్‌లోడ్‌ చేస్తూ ఫేమస్ అయ్యారు. యూట్యూబ్‌లో అతడికి దాదాపు 14 మిలయన్ ఫాలవోర్స్ ఉన్నారు. ఇటీవల బెట్టింట యాప్స్‌, ఇతర నిషేధిత యాడ్స్ ను ప్రమోట్ చేస్తున్నారని ఆరోపణలు వెలువడ్డాయి. ఇదిలాఉంటే.. హర్షసాయి హీరోగా ఓ సినిమా కూడా మొదలైంది. ఆయనే సొంతంగా ఓ కథ రాసుకుని, స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించాడు. ఈ మూవీనే 'మెగా'. ఇందులో హీరోయిన్‌ నే బాధిత యువతి. ఈ సినిమాకు నిర్మాత ఎవరో కాదు బిగ్ బాస్ ఫెమ్ మిత్ర శర్మ. ఈ అమ్మాయే ఆ బాధితురాలని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X