Harsha Sai MEGA Review: హీరో కమ్ డైరెక్టర్‌గా హర్షసాయి.. అసలు ఈ మెగా 'లో డాన్' అంటే ఏంటంటే?

యూట్యూబర్ హర్షసాయి అంటే తెలియని వారుండరు. సోషల్ మీడియాను వాడే ప్రతి ఒక్కరికి హర్షసాయి అంటే తెలుసు. అయితే హర్షసాయి ఓ సినిమా చేస్తున్నాడు. అది కూడా పాన్ ఇండియా లెవెల్ లో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. స్వయంగా ఆయనే కథ రాసుకుని డైరెక్టర్ కమ్ హీరోగా మారి ఆ సినిమాను రూపొందిస్తున్నాడు. ఇప్పుడు ఆ సినిమా టైటిల్ టీజర్ నేడు లాంఛ్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే....

యూట్యూబర్‌గా హర్హసాయి సోషల్ మీడియా వారే ప్రతిఒక్కరికి సుపరిచితమే. ఈయన యూట్యూబ్ ఛానెల్‍ కు 9 మిలియన్లకు పైగా సబ్‍స్క్రైబర్లు ఉన్నారంటే ఎంత ఫేమసో ఆలోచించండి. అంత ఫేమస్ అయిన హర్షసాయి హీరోగా ఓ మూవీ చేస్తున్నాడు. అది కూడా పాన్ రేంజ్‍లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా టైటిల్ టీజర్ ఈరోజు అనగా..సెప్టెంబర్ 17న రిలీజ్ అయింది. విభిన్నమైన బ్యాక్‍ డ్రాప్‍ లో యాక్షన్ డ్రామాగా ఈ మూవీ రూపొందినట్లు తెలుస్తోంది.

Youtuber Harsha Sai Mega Lo Don Telugu Movie Title Teaser Out and Mega Lo Don Meaning Details Here

హర్ష సాయి స్వయంగా కథ రాసుకుని దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు 'మెగా' అని పేరు పెట్టారు. దానికి లో డాన్'అనే (MEGA - Lo Don) క్యాప్షన్ ఇచ్చారు. ఇక ఈ 'మెగా - లో డాన్' మూవీ పాన్ ఇండియా రేంజ్‍ లో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ , హిందీ భాషల్లో రానుంది. వచ్చే ఏడాది ఈ సినిమాను రిలీజ్ చేయనన్నట్టు టీజర్ లో మేకర్స్ తెలిపారు.

ఇక మెగా సినిమాను శ్రీ పిక్చర్స్ పతాకంపై బిగ్‍బాస్ ఫేమ్ మిత్ర ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కల్వకుంట్ల వంశీధర రావు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. వికాస్ బాడిస ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమా టీజర్ నేడు రిలీజ్ అయి ఆకట్టుకుంటుంది. అసలు ఈ మెగా లో డాన్ అని ఎందుకు పేరు పెట్టారని నెటిజన్స్ సెర్చ్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమా టీజర్ విషయానికి వస్తే... ఓ భారీ గంటకు హీరో హర్షసాయిని కట్టేసి కొందరు శిక్ష విధించే సీన్‍ తో మూవీ టైటిల్ టీజర్ మొదలు అవుతుంది. ఓ డిఫరెంట్ బ్యాక్‍ డ్రాప్‍లో ఈ సినిమాను తెరకెక్కించారని టీజర్ చూసినంత సేపు అనిపిస్తూ ఉంటుంది. హర్షసాయి వీపుపై ఉన్న టాటూను హైలైట్ చేస్తూ టీజర్ సాగింది. ఓ వింత మనిషి అనగా కోతి రూపంతో కనిపిస్తాడు. ఓ సమూహం ఇలా టీజర్ గ్రాండ్‍ గా ఏదో కొత్తగా చూపించనున్నట్లు అర్ధం అవుతుంది.

Youtuber Harsha Sai Mega Lo Don Telugu Movie Title Teaser Out and Mega Lo Don Meaning Details Here

మెగా టీజర్ లో హర్షసాయి ఓ డైలాగ్ చెప్పడం ఈ టీజర్ కే హైలెట్ గా నిలిచింది. "జీవితంలో ఓటమిని ఒప్పుకున్న క్షణమే.. నిజమైన ఓటమి.. నన్ను చూస్తే ఒప్పుకునే వాడిలా కనిపిస్తున్నానా" అంటూ హర్షసాయి చెప్తాడు. ఆ తర్వాత హర్షకు ఓ ఆత్మ కనిపిస్తుంది. జంతువులు, సింహాలు, సముద్రం అంటూ డైలాగ్స్ ఉన్నాయి. 'మెగా - లో డాన్' అనేది అత్యంత భారీ జంతువు అని ఈ టీజర్‌లో ఉంది. "ఈ కథ రాక్షసులతో నిండిన సముద్రాన్ని కుదిపేసి రాజైన మనిషి కథ" అంటూ ఈ టీజర్ ముగిసింది.

ఇక ఈ మెగా లో డాన్ అంటే.. సముద్రంలో ఉండే భారీ జంతువు అని తెలుస్తోంది. ఇది చూడటానికి షార్క్ లా ఉంటుంది. ఇది చాలా శక్తివంతమైన జంతువు. ఇది కొరికితే.. ఏదైనా ముక్కలు కావాల్సిందే. ఇక ఈ టైటిల్ అలా పెట్టడానకిి రీజన్ ఏంటో తెలియదు. మున్ముందు తెలుస్తోందేమోనని చూడాలి. ఇక మొత్తంగా 'మెగా' మూవీ టైటిల్ టీజర్ ఆసక్తిని రేకెత్తించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X