Youtuber Harsha Sai: నా కోరిక తీర్చవా? బాధితురాలితో హర్షసాయి క్లిప్లింగ్ లీక్..ఇంకా ఏమున్నదంటే?

Youtuber Harsha Sai: టాలీవుడ్ లో లైంగిక వేధింపులు పరంపర కొనసాగుతోంది. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల వివాదం ముగియకముందే మరో వివాదం తెరమీదికి వచ్చింది. ఈ సారి ప్రముఖ యూట్యూబర్, యువ నటుడు హర్షసాయిపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. హర్ష సాయి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ఓ యువ నటి ఆరోపించింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు నార్సింగ్ పోలీస్‌స్టేషన్‌లో హర్షసాయి పై లైంగిక వేధింపులు, చీటింగ్, బ్లాక్ మెయిల్ కేసు నమోదైంది. ఈ తరుణంలో యూట్యూబర్ హర్ష సాయికి సంబంధించిన ఆడియో అంటూ ఓ క్లిప్ ప్రత్యక్షమైంది. ప్రస్తుతం ఆ క్లిప్ నెట్టింట్లో తెగవైరలతోంది.

ప్రముఖ యూట్యూబర్, యువ నటుడు హర్షసాయి.. తనని ప్రేమ, పెళ్లి పేరుతో తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని, తనకు మత్తు ఇచ్చి తన నగ్నచిత్రాలను తీశాడని ఓ యువతి ఫిర్యాదు చేసింది. హర్షసాయి నటించి మెగా సినిమా కాపీరైట్స్ కోసం తన మధ్య విభేదాలు వచ్చాయనీ, ఈ క్రమంలో హర్షసాయి తనకు మత్తుమందు ఇచ్చి పలుమార్లు అఘాయిత్యానికి పాల్ప‌డినట్టు ఆరోపించింది బాధితురాలు. అంతేకాకుండా.. వాటిని అడ్డుపెట్టుకుని బ్లాక్‌మెయిల్‌ చేశాడని, ఈ క్రమంలో పెద్ద ఎత్తున్న డబ్బు గుంజాడని ఫిర్యాదులో పేర్కొన్నది. తన అడ్వకేట్ సహయంతో వచ్చి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Youtuber Harsha Sai Mitraaw Sharma Audio call Leak viral in Social media

బాధితురాలి ఫిర్యాదు మేరకు నార్సింగ్ పోలీసులు రేప్ కేసు హర్షసాయిపై లైంగిక వేధింపులు, చీటింగ్, బ్లాక్ మెయిల్ కేసు నమోదైంది. హర్షసాయి తన అసభ్య వీడియోలతో బెదిరించాడని ఫిర్యాదు చేయడంతో అతడిపై కేసు పెట్టాం. ఐపీసీ 376, 354 సెక్షన్ల కింద కేసు పెట్టామని రాజేంద్ర నగర్ డీసీపీ శ్రీనివాస్ మీడియాకు వెల్లడించారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఈ కేసు నమోదు కావడంతో హర్షసాయి పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.

తనపై ఆరోపణలపై యూట్యూబర్ హర్షసాయిపై స్పందించారు.'అవన్నీ తప్పుడు ఆరోపణలు. డబ్బులు కోసమే నాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. నా గురించి మీకు తెలుసు. నిజానిజాలు త్వరలో బయటకు వస్తాయి. మా న్యాయవాది తానికొండ చిరంజీవి ద్వారా త్వరలో అన్ని విషయాలను మీ ముందుకు తీసుకవస్తా..' అని హర్షసాయి తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. ఈ ప్రస్తుతం ఆ ట్వీట్ నెట్టింట్లో తెగ వైరలవుతోంది.

ఈ క్రమంలోనే మరో నిందితుడు హర్షసాయి, బాధితురాలు ఆడియో క్లిప్ అంటూ నెట్టింట్లో ఓ ఆడియో క్లిప్ వైరలవుతోంది. ఈ ఆడియో క్లిప్ లో 'నీకు నా మీద ప్రేమ లేదని బాధితురాలు ప్రశ్నించగా.. ఆ విషయాన్ని చెప్పకుండా.. నువ్వు అడిగిన పాయింట్లే చెప్పుతున్నా..కాదా అని హర్ష అనడం. దీంతో కోపోద్రిక్తురాలైన బాధితురాలు 'ఎన్నో సార్లు అడగాలి ఒకే విషయాన్ని. మన సంబంధానికి కాపాడుకోవడానికి ఏం ఇస్తున్నావ్? అని ప్రశ్నించింది.

అసలు నా జీవితాన్ని ఏం చేద్దామని అనుకుంటున్నావు.. రసికరాజు కాకుండా ఎలా ఉండగలుగుతున్నావు. ప్రేమించాలని మనసులో లేదా? అని ప్రశ్నించగా.. దానికి హర్ష సాయి బదులిస్తూ.. 'అలా అని ఏమీ లేదు' ఏదో దాటేశాడు. దీంతో రియాక్ట్ అయిన బాధితురాలు 'ఏంటీ పరిస్థితి.. నువ్వేమైనా యూపీఎస్సీ ఎగ్జామ్ రాస్తున్నావా? సంవత్సారాలు సంవత్సరాలు అయిపోతున్నాయి. నాకేంటి ఈ గోల వయస్సు కూడా అయిపోతుంది. ప్రేమించాలని మనస్సులో లేదా? నేను కాకపోతే ఇంకెవరైనా ఇష్టమా చెప్పు..నేను చెప్తుంది నీకు అర్థం కావడం లేదా..? అని హర్ష సాయిని అడిగింది. ఏదిఏమైనా.. ఈ కేసులో నిజానిజాలు తెలియాలంటే.. కోర్టు నుంచి తీర్పు వచ్చే వరకు వేచి ఉండాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X