‘ఆ లింక్ పెట్టితే.. 10 కోట్లు ఇస్తారు’: బయటపడ్డ హర్ష సాయి బాగోతం.. మరో ఆడియో లీక్

Harsha Sai: సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన యూట్యూబర్ హర్ష సాయి లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. తాజాగా నిందితుడు హర్ష సాయి, బాధితురాలు మాట్లాడుకున్న మరోక ఆడియో లీకైంది. నెట్టింట్లో తెగ వైరల్ అవుతూ సంచలనం సృష్టిస్తోంది. ఇంతకీ ఆ వైరలో ఏముందో లూక్కేయండి.

తెలుగులో పాపులర్ యూట్యూబర్ హర్ష సాయి అందరికీ సుపరిచితుడే. యూట్యూబ్, సోషల్ మీడియాలో సెన్సేషనల్ గా మారారు హర్ష సాయి. అతి తక్కువ కాలంలో బాగా ఫేమస్ అయ్యారు. ఈ పాపులరీతో 'మెగా' అనే సినిమాతో హీరోగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టాలని భావిస్తున్నాడు హర్ష సాయి. ఇక్కడ వరకూ అన్ని బాగానే ఉన్నా.. గత కొంత కాలంగా యూట్యూబర్ హర్ష సాయి వరుస పలు వివాదాలు చుట్టుముడుతున్నాయి. గత రెండు నెల కిత్రం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ వివాదం ఇర్కున్న హర్ష సాయి తాజాగా లైంగిక దాడి, చీటింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.

Youtuber Harsha Sai Sensational Audio Leak about Betting Apps Promotion

యూట్యూబర్ హర్షసాయి తనని ప్రేమ, పెళ్లి పేరుతో తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని, తనకు మత్తు ఇచ్చి తన నగ్నచిత్రాలను తీశాడని ఓ యువతి ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో రెండు కోట్లు తీసుకుని మోసం చేశాడంటూ హర్ష సాయిపై ఓ యువతి యువతి నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా.. హర్ష సాయి తండ్రిపై కూడా కంప్లైంట్ ఇచ్చింది. భాదితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు హర్ష సాయిపై 376, 354 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రేప్ కేసు నమోదు కావడంతో పరారీలో ఉన్నారు. అతడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఆ తరువాత హర్ష సాయి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ అవన్నీ తప్పుడు ఆరోపణలు అని పేర్కొన్నారు. అంతేకాకుండా త్వరలోనే నిజం బయటకు వస్తుందని, వీటన్నింటినీ తన తరఫున ఉన్న న్యాయవాది త్వరలోనే క్లారిటీ ఇచ్చారని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ఓ హర్ష, బాధితురాలితో మాట్లాడిన ఫోన్ కాల్ రికార్డింగ్ను బయటపెట్టిన విషయం తెలిసిందే. అయితే.. బాధితురాలు ఎక్కువగా మాట్లాడటం ఎక్కువ అనుమానాలకు తావిచ్చింది. ఇలా ఈ కేసులో రోజుకో ట్విస్ట్ బయటకు వస్తోంది.

ఈ నేపథ్యంలోనే తాజాగా మరో షాకింగ్ ఆడియో బయటకు వచ్చింది. ఈ ఆడియోలో బట్టి చూస్తే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ విషయంలో బాధితురాలికి హర్ష సాయికి మధ్య వివాదం తలెత్తినట్టు తెలుస్తోంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేస్తే ఆ ప్రభావం మెగా సినిమాపై కూడా పడుతుందని బాధితురాలు చెబుతూ ఉండగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ తనకు కోట్లలో డబ్బు వస్తుందని చెప్పడం వినవచ్చు. ఈ ఆడియోలో నిందితుడు హర్ష సాయి మాట్లాడుతూ.. లోటస్ 360 అనే బెట్టింగ్ యాప్ గురించి మాట్లాడాడు. ఈ యాప్ ను ఇటీవలనే సెంట్రల్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది.

Youtuber Harsha Sai Sensational Audio Leak about Betting Apps Promotion

ఈ నిషేధిత బెట్టింగ్ యాప్ లింక్ తన మూవీలో గానీ, తన వీడియోలో పెడితే 10 కోట్లు ఇస్తారని హర్ష సాయి చెప్పాడు. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తే.. ఎన్ని కోట్లైనా ఇస్తారని హర్ష సాయి ఎలాంటి మొహమాటం లేకుండా చెబుతున్నట్టు ఆ ఆడియోలో తెలుస్తోంది. తాను ఆ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేయకపోతే మరో పదిమందితో బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు ప్రమోషన్స్ చేయిస్తారని, అందుకే తాను కచ్చితంగా ప్రమోషన్స్ చేస్తాననీ, అవి తన మార్కెట్ వేల్యూ పెంచుతాయని హర్ష సాయి చెబుతున్నాడు. ఈ ఆడియో కాల్స్ పరిశీలిస్తే.. ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేయడాని హర్ష సాయి సమర్ధించుకుంటున్నాడు. గతంలో హర్షసాయిపై ఇలాంటి ఆరోపణలే వస్తే.. తానేం తప్పు చేయడం లేదని, తనను తాను సమర్ధించుకునే ప్రయత్నం చేశాడు.

More from Filmibeat

Read more about: harsha sai
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X