Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
కరాటే కళ్యాణి డబ్బులు అడిగింది.. చంపేస్తానని బ్లాక్మెయిల్..జరిగింది ఇదే: శ్రీకాంత్ రెడ్డి
తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ కరాటే కళ్యాణి నిన్న జరిగిన గొడవ తో ఒక్కసారిగా వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డిని ఆమె అతని ఇంటి ముందు రోడ్డుపై కొట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఫ్రాంక్ వీడియోలతో మహిళలను అవమాన పరుస్తున్నారు అని అలాగే హిందువులను కూడా అవమాన పరిచే విధంగా అతను వీడియోలు చేస్తున్నాడు అంటూ కరాటే కళ్యాణి ఆరోపిస్తూ అతనిపై చేయి చేసుకుంది. అయితే కొద్ది సేపటి క్రితం శ్రీకాంత్ రెడ్డి కూడా తన వివరణ ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు. అతను ఏం చెప్పాడు అనే వివరాల్లోకి వెళితే..
ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే..
శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. నేను ఫ్రాంక్ వీడియోలు చేసేది కేవలం ఒక ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే. రాత్రి భోజనం చేస్తూ ఉండగా కొంత మంది మా ఇంటి ముందుకు వచ్చి గట్టిగా అరుస్తూ బయటకి రావాలని అన్నారు. ఆ తరువాత బయటకు వచ్చి చూస్తే ముగ్గురు అబ్బాయిలు కరాటే కళ్యాణి ఉన్నారు. బయటి రాగానే ఆమె నువ్వు సమాజాన్ని తప్పుదోవ పట్టించే వీడియోలు చేస్తున్నావు అంటూ దూషించింది. అప్పుడు నేను నువ్వు కృష్ణ సినిమా లో బాబి అనే క్యారెక్టర్ చేసావు. దాని కంటే ఇది ఏమి ఎక్కువ కాదు అని ప్రశ్నించాను.. అంతేకాకుండా నేను ఎవరితోనూ బలవంతంగా ప్రాంక్ విడుదల చేయలేదు డబ్బులు ఇచ్చి ఆర్టిస్టుగా స్థిరపడాలి అనే వారితో చేస్తాను.. అని చెప్పినట్లుగా శ్రీకాంత్ తెలియజేశాడు.
బ్లాక్మెయిల్ చేసింది
ఆ తర్వాత ఆమె లక్ష రూపాయలు డబ్బులు ఇవ్వాలి అని బ్లాక్మెయిల్ చేసింది. నాకు మహిళా సంఘాలు తెలుసు ప్రభుత్వ అధికారులు తెలుసు అంటూ నన్ను బెదిరించింది. ఆమెతో వచ్చిన మరొక వ్యక్తి నన్ను పక్కకు తీసుకువెళ్లి 70 వేలు ఇస్తే సరిపోతుంది అని ఉన్నాడుమ్ ఆ తర్వాత నేను డబ్బులు ఎందుకు ఇవ్వాలి అని ప్రశ్నించడం జరిగింది. ఇక ఆ తర్వాత నా పై పోలీస్ కేసు పెడతాను అంటూ చెంపదెబ్బలు కూడా కొట్టడం జరిగింది. నేను కూడా మొదట ఆమె మహిళ అనే గౌరవం ఇచ్చాను. కానీ మూడోసారి కూడా నన్ను కొట్టడం జరిగింది. ఆమెతో వచ్చిన ముగ్గురు కూడా కర్రలు తీసుకొని వచ్చి నన్ను కొట్టడానికి ప్రయత్నం చేశారు. నేను కూడా రివర్స్ అవ్వడం జరిగింది.. అని అన్నాడు.
ఆ వీడియోల కంటే ఎక్కువ కాదు
అసలు నేను చేసిన వీడియోలు చూసుకుంటే మీకే ఒకసారి అర్థం అవుతుంది. అది కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే. స్క్రిప్ట్ తో డబ్బులు ఇచ్చి చేసే ప్రాంక్ వీడియోలు. పుష్ప సినిమాలోని ఐటెం సాంగ్ అలాగే ఆశిక్ బనాయా సాంగ్ కూడా ఇప్పటికీ టీవీల్లో వస్తూనే ఉంటుంది. వాటికంటే నా వీడియోలు ఏమీ ఎక్కువ కాదు.. అన్నాడు.
కావాలని నాపై రేప్ కేసు
అలాగే కరాటే కళ్యాణి చేసిన పాత్రల కంటే కూడా అవి ఎక్కువ కాదు. నేను ఏదో బ్రతుకు తెరువు కోసం అలా ఎంటర్టైన్మెంట్ వీడియోలు చేసుకుంటున్నాను. కానీ కరాటే కళ్యాణి కావాలి అని నాపై రేప్ కేసు పెట్టిస్తా అని కూడా బెదిరించింది. నా పై చేయి చేసుకుని కూడా జనాల ముందు నన్ను షేమ్ చేయడం జరిగింది.. అని శ్రీకాంత్ తెలియజేశాడు.
చంపేస్తాను అంటూ..
అందుకే ఇప్పుడు జనాల సపోర్ట్ నాకు అవసరం ఉంది. కాబట్టి నాకు సపోర్ట్ చేయండి. నేను అయితే ఏ తప్పు చేయలేదు. శృతి మించి కూడా చేయలేదు. కావాలనే కరాటే కళ్యాణి ఈ విధంగా తప్పు చేసింది. నేను నిజంగా ఏదైనా తప్పు చేసి ఉంటే పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ ఇవ్వాల్సింది. కానీ ఆమె కంప్లైంట్ ఇవ్వకుండా నా పై చేయి చేసుకోవడం నాకు నచ్చలేదు. ఆమె నన్ను చాలా భయంకరంగా బెదిరిస్తోంది. నిన్ను చంపేస్తాను నాకు తెలిసిన మనుషులు ఉన్నారు అని బెదిరించింది. కాబట్టి నాకు సపోర్ట్ చేయవల్సిందిగా కోరుతున్నాను అని శ్రీకాంత్ తెలియజేశాడు.