పవన్ కళ్యాణ్ పై ట్రోల్స్.. ఏకిపారేసిన నిర్మాత.. అందరూ జైలుకే అంటూ..

ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ ప్రజలకు మంచి పాలన అందిస్తున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉండి కూడా ప్రజల వద్దకే పాలనను అందిస్తున్నారు. నేరుగా తానే ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకుంటూ వెంటనే పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పల్లెలను తీర్చిదిద్దేందుకు కంకణం కట్టుకొని పని చేస్తున్నారు. పలు ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో కూడా వైసీపీ నేతలు పలు సందర్భాల్లో విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. అయినా మౌనంగానే ముందుకు వెళ్తున్నారు. కానీ రీసెంట్ గా ఒక ఘటనతో పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేతలు విమర్శలు గుప్పించ సాగారు. దానిపై టాలీవుడ్ ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ తీవ్రంగా స్పందించారు. వారి విమర్శలను తిప్పి కొట్టారు.

ఏపీ రాజకీయాల్లో పవనుడి ప్రభంజనం..
2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎంతటి ప్రభంజనం సృష్టించారో తెలిసిందే. ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు.. పవన్ కళ్యాణ్ అటు జనసేన పార్టీ నుంచి నిల్చున్న 21 మంది ఎమ్మెల్యేలను గెలుపుచుకున్నారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలుపొందిన సంగతి తెలిసిందే. ఇండియాలోనే 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించిన పార్టీగా పవన్ కళ్యాణ్ రికార్డు క్రియేట్ చేశారు. మరోవైపు వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించారు. డిప్యూటీ సీఎం పదవిని స్వీకరించి ప్రస్తుతం ప్రజాక్షేత్రంలో నిర్విరామంగా పనిచేస్తున్నారు. ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ ఉన్నారు.

YPC Leaders unnecessary trolls on Pawan Kalyan

సెలూన్ ప్రారంభోత్సవంలో పవన్ కళ్యాణ్?
పవన్ కళ్యాణ్ తన దగ్గర చాలా కాలంగా పనిచేసిన పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్ ఇటీవల సొంతంగా సెలూన్ ను ప్రారంభించారు. విజయవాడలోని ఖానూర్ లో సెలూన్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ సెలూన్ ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్ హాజరై ప్రారంభించారు. అతనికి శుభాకాంక్షలు తెలిపారు. అయితే దీనిపై గిట్టని వైసీపీ నేతలు ట్రోల్స్ ప్రారంభించారని పలువురు సినీ ప్రముఖులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెలూన్ ప్రారంభించడమే అభివృద్ధా అని ఎగతాళి చేసిన వారిపై తాజాగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలోని ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ మండిపడ్డారు.

త్వరలో వాళ్లు కూడా జైలుకే..
వైసీపీ నేతల వ్యాఖ్యలపై నిర్మాత నట్టి కుమార్ మాట్లాడుతూ.. 'పవన్ కళ్యాణ్ తన దగ్గర పని చేసిన వ్యక్తి ఎదుగుదలను కోరుకుంటున్నారు. అతను సెలూన్ ప్రారంభించుకోవడంతో ఆహ్వానిస్తే మంచి మనసుతో వెళ్లి ప్రారంభించి, శుభాకాంక్షలు చెప్పడం, ధైర్యం చెప్పడం తప్పేమీ కాదు కదా.పవన్ కళ్యాణ్ కు చాలా పనులు ఉన్నయి. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ఆయన బిజీగా ఉంటున్నారు. ఇక పనిలేని వాళ్లు ఇలాంటి కామెంట్లు చేస్తున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మంచి తనం వల్లనే ఆ నోర్లు లేస్తున్నాయి. ఇప్పటికే కొందరు వైపీసీ నేతలు జైలులో ఉన్నారు. మరి కొందరు పరారీలో ఉన్నారు. ఇక మిగిలిన ఇద్దరు కూడా, బయట ఉన్న వారు కూడా గతంలో వారు చేసిన తప్పులతో జైలుకు వెళ్తారు. ఇప్పటికే వెళ్లి ఉన్నారని అనుకున్నాను.' అని చెప్పుకొచ్చారు.

పవన్ కళ్యాణ్ రాబోయే చిత్రాలు..
తను సైన్ సినిమాలను పవన్ కళ్యాణ్ ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నారు. పొటికల్ కార్యక్రమాలతో బిజీగా ఉండటం కారణంగా ఆలస్యమైన చిత్రాలను పూర్తి చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఇప్పటికే హరి హర వీరమల్లు, ఓజీ చిత్రాలకు సంబంధించిన షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేశారు. జూన్ 11న హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకోవాల్సిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర షూటింగ్ కూడా హాజరయ్యారు. ఈ నెలలోనే ఆ సినిమా షూటింగ్ ను కూడా పూర్తి చేయబోతున్నారు.

More from Filmibeat

Read more about: pawan kalyan natti kumar ycp
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X