సినిమా తారలు ప్రజాకర్షణతో రాజకీయాల్లోకి రావటం ముఖ్యమంత్రులు, దేశాధినేతలు కావటం ప్రపంచానికి కొత్తేమి కాదు. కాని రివర్స్ లో మన ముఖ్యమంత్రి వై.యస్.రాజశేఖర రెఢ్డి 'ఆప్త బంధువు' అనే సినిమాతో నటనా కెరీర్ కి ఎంట్రీ ఇవ్వనున్నారు. దీనికి ప్రభుత్వ సలహాదారుల్లో ఒకరైన సి.సి.రెడ్డి నిర్మాత. ఆయన ఈ మధ్య 'మీ శ్రేయాభిలాషి' సినిమాతో అందరి ప్రసంశలు అందుకున్నారు.ఇందులో వై.యస్. నిజ జీవిత పాత్ర (ముఖ్యమంత్రి )పోషించబోతున్నారు.గెస్ట్ గా కనపడే ఈయనని డైరక్ట్ చేయబోయేది 'తమ్ముడు' సినిమా తో పాపులర్ అయిన దర్శకుడు అరుణ్ ప్రసాద్. ముఖ్యమంత్రి గా వై.యస్. ప్రజలకు ఎంత దగ్గరగా మెలుగుతున్నారనేది కాన్సెప్ట్. ఈ ప్రచార చిత్రం జూన్ లో ప్రారంభమవుతుందిట. వై.యస్ కి సంభంధించిన దృశ్యాలు సీఎం క్యాంప్ కార్యాలయంలో కొత్తగా ఏర్పాటు చేసిన స్టూడియోలో చిత్రీకరిస్తారట.రాజకీయ నాయకులకు నటన అనేది నరనరాన జీర్ణించుకుపోయిన ఆర్ట్ కాబట్టి దర్శకుడుకి కష్టం కాదంటున్నారు.