మహేష్ బిజినెస్ మ్యాన్ ఆడియో ఫంక్షన్ కి ఛీఫ్ గెస్ట్ వైయస్ జగన్...!?
మహేష్ బాబు సినిమా అనగానే మ్యూజిక్ కి కూడా ఎంతో ప్రాధాన్యత వుంటుంది. అందుకే, ఆయా దర్శకులు ఈ విషయంలో కేర్ తీసుకుంటారు. అదే పూరీ జగన్నాథ్ అయితే మరింత ఎక్కువే తీసుకుంటాడు. గతంలో మహేష్ తో తను తీసిన 'పోకిరీ' సినిమాని మ్యూజికల్ హిట్ చేసిన సంగతి మనకు తెలిసిందే! అలాగే, ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లోనూ వస్తున్న 'బిజినెస్ మేన్' సినిమాలో కూడా పాటలకి అంతే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందుకోసం సంగీత దర్శకుడు తమన్ ని పూరీ రాచిరంపాన పెడుతున్నాడట!
ఇందులో 'ఏ పాటకాపాటే స్పెషల్ సాంగ్' అని తమన్ అంటున్నాడు. పూరీ స్టయిల్లో ఐటెం పాట ఉందనీ, అలాగే ఓ థీం సాంగ్ కూడా ఉందనీ చెబుతున్నాడు. "ఈ థీం సాంగ్ ని కొత్తగా చేయాలనుకున్నాను. అందుకే, ఆ పాటని మహేష్, జగన్ లతో పాడించాలని ప్లాన్ చేశాను. వాళ్లకు చెప్పగానే ఓకే అన్నారు. మహేష్ పాడడానికి ఒప్పుకోవడాన్ని అసలు నేనే నమ్మలేకపోతున్నాను. ఈ వారంలోనే ఈ పాటను రికార్డు చేస్తాను' అంటున్నాడు తమన్. ఈ సినిమా విషయంలో ఏదో తెలియని ఎనర్జీ పనిచేస్తోందనీ, అందుకే అన్నీ స్పీడుగా జరిగిపోతున్నాయనీ తమన్ అంటున్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనులు శబ్దాలయ స్టుడియోలో జరుగుతున్నాయి. డిసెంబర్ ఒకటి నుంచి 'బిజినెస్ మేన్'కు రీరికార్డింగ్ మొదలుపెడతాడట!
ఆర్ ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై వెంకట్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మహేష్ సరసన కాజల్ అగర్వాల్ నటించింది. 'బిజినెస్ మ్యాన్" చిత్రం 12 జనవరి 2012 న భారీ విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ చిత్ర ఆడియో వేడుక డిసెంబరు 23న హైదరాబాదులో నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ వేడుకకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ ముఖ్య అతిథిగా విచ్చేస్తారని టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది.


Click it and Unblock the Notifications











