For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మహేష్ బాబుపై వైఎస్ జగన్ ఫ్యాన్స్ ఫైర్.. ఇదీ సంగతి

|
మహేష్ బాబు పై విరుచుకుపడుతున్న జగన్ ఫ్యాన్స్ || YSRCP Fans Fires On Hero Mahesh Babu || Oneindia

సోషల్ మీడియా వేగంగా విస్తరించడం, విస్తృతంగా అందుబాటులోకి రావడంతో ప్రతీ చిన్న విషయం కూడా పెద్ద రాద్దాంతమే అవుతోంది. ప్రతీ నిమిషం సెలబ్రిటీలను ఫాలో అవుతూ ఏ చిన్న లోపం కనిపించినా ట్రోల్స్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు నెటిజన్లు. ఒకానొక పర్టికులర్ సందర్భంలో సెలబ్రిటీలు ఎందుకు అలా ఉండాల్సి వచ్చింది? దానికి కారణాలేంటి? అనేవి ఏ మాత్రం పరిగణలోకి తీసుకోకుండా కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి పరిణామమే సూపర్ స్టార్ మహేష్ బాబు ఎదుర్కోవాల్సి వస్తోంది. మహేష్ తీరు పట్ల జగన్ ఫ్యాన్స్ కొందరు గుర్రుగా ఉండటం పలు చర్చలకు దారితీస్తోంది. వివరాల్లోకి పోతే..

విజయ నిర్మల మరణం.. శోక సంద్రంలో కృష్ణ ఫ్యామిలీ

విజయ నిర్మల మరణం.. శోక సంద్రంలో కృష్ణ ఫ్యామిలీ

నటీమణి, సూపర్ స్టార్ కృష్ణ రెండో భార్య విజయ నిర్మల మరణంతో ఘట్టమనేని ఫ్యామిలీ అంతా శోకసంద్రంలో మునిగిపోయింది. తన అర్దాంగి దూరం కావడం జీర్ణించుకొని కృష్ణ కన్నీరు మున్నీరయ్యారు. ఈ నేపథ్యంలో కృష్ణను ఓదార్చడానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన ఇంటికి వస్తున్నారు. కాసేపు కృష్ణతో ముచ్చటించి ధైర్యం చెబుతున్నారు.

 చంద్రబాబు, బాలకృష్ణ పరామర్శ.. పక్కనే మహేష్ బాబు

చంద్రబాబు, బాలకృష్ణ పరామర్శ.. పక్కనే మహేష్ బాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఇద్దరూ కలిసి కృష్ణను ఓదార్చారు. స్వయంగా కృష్ణ ఇంటికి వచ్చి విజయ నిర్మల మృతి పట్ల తమ సానుభూతి తెలియజేస్తూ కృష్ణకు ధైర్యం చెప్పారు. అయితే ఆ సమయంలో మహేష్ బాబు కూడా ఇంట్లోనే ఉన్నారు. చంద్రబాబు, బాలకృష్ణలను రిసీవ్ చేసుకొని వారితో కాస్త సమయం కేటాయించారు. ఈ పిక్స్ సోసిల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ముఖ్యమంత్రి జగన్ వచ్చిన సమయంలో

ముఖ్యమంత్రి జగన్ వచ్చిన సమయంలో

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కూడా కృష్ణను ఓదార్చేందుకు ఆయన ఇంటికి వెళ్లారు. సతీమణి పోయిన బాధలో ఉన్న కృష్ణను ఆప్యాయంగా పలకరించి ఆయనలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. అయితే జగన్ వచ్చిన సమయంలో మహేష్ బాబు కనిపించలేదు. ఇది కాస్త సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. కొందరు నెటిజన్లు మహేష్ పై ట్రోల్స్ చేస్తూ ఈ ఇష్యూను పెద్దది చేస్తున్నారు.

అంత వివాదాస్పదం కానే కాదు.. అయినా

అంత వివాదాస్పదం కానే కాదు.. అయినా

నిజానికి ఈ విషయం అంత వివాదాస్పదం కాదు. తన కార్యక్రమాలతో బిజీగా ఉండడం వల్ల జగన్ వచ్చిన సమయంలో మహేష్ బాబు అక్కడ లేక పోవచ్చు, లేదా జగన్ రాక పై మహేష్ బాబుకు సమాచారం లేకపోయి ఉండొచ్చు. అంతేతప్ప మహేష్ ఏదో కావాలని చేసింది మాత్రం కాదు. ఎన్ని మనస్పర్థలు ఉన్నా విషాద సమయంలో అవన్నీ మర్చిపోయి కలుస్తుండటం అందరిలోనూ కామన్‌గా జరిగే పరిణామమే. ఈ చిన్న లాజిక్ కూడా మిస్ అయి ఈ అంశాన్ని పెద్దది చేయడం సరి కాదని అంటున్నారు సినీ, రాజకీయ విశ్లేషకులు.

English summary
N Chandrababu Naidu was at Superstar Krishna's house in Hyderabad to express condolence over the passing away of Vijaya Nirmala on Sunday, Mahesh Babu was seen with him. But when Ys jagan came mahesh is not there
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more