మహానాయకుడే చూడాలంట.. లక్ష్మీస్ ఎన్టీఆర్ చూడొద్దట.. వైఎస్ జగన్ ఫైర్
Recommended Video

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ డైరెక్షన్‌లో రూపొందిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం పాజిటివ్ టాక్‌తో ముందుకెళ్తున్నది. ఈ సినిమా రిలీజ్‌కు ముందు అనేక వివాదాల్లో కూరుకుపోయింది. అంతేకాకుండా ఏపీలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయకుండా కోర్టు అడ్డుకోవడం మరో వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. తాజాగా ఈ సినిమాను రిలీజ్ చేయకపోవడంపై వైఎస్ జగన్ తీవ్రంగా విమర్శించారు. ఆయన ఏమన్నారంటే..

వాళ్ల సినిమానే చూడాలంట
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్‌ను అడ్డుకోవడంపై శుక్రవారం ఓ బహిరంగ సభలో వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు. మహానాయకుడు వాళ్ల సినిమా. ఆ సినిమానే చూడాలంట. ఆయనకు వ్యతిరేకంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా రిలీజైతే అడ్డుకొన్నారు. ఆ సినిమా ఆయనకు వ్యతిరేకంగా తీసిన సినిమా కూడా కాదు. దానిని రిలీజ్ కాకుండా అడ్డుకోవడం చాలా దారుణం అని వైఎస్ జగన్ అన్నారు.
ఆ ఖర్మ మనకెందుకని
ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను అడ్డుకొన్నారు. కోర్టు ఆదేశాలతో రిలీజ్‌ను నిలిపివేశారు. ఇలాంటి ప్రభుత్వానికి ఓటు వేస్తే ఇక స్వేచ్ఛ ఉండదు. వాళ్ల సినిమాలే చూడాలి. వాళ్ల పేపర్లే చదువాలి. వాళ్ల టెలివిజన్ ఛానెళ్లే చూడాల్సిన ఖర్మ వస్తుంది అని వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు.

నిజం బయటకు తెలుస్తుందని.. వర్మ
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను రిలీజ్ కాకుండా అడ్డుకోవడంపై వర్మ తీవ్రంగా మండిపడ్డారు. ఏపీలో సినిమాను రిలీజ్ కాకుండా ఆపడం చాలా దారుణం. ప్రపంచవ్యాప్తంగా రిలీజైన సినిమా ద్వారా ప్రజలకు నిజం తెలుస్తుంది. ఏపీలో త్వరగా రిలీజ్ చేయడానిక సుప్రీంకోర్టును ఆశ్రయించాం అని వర్మ తెలిపారు.

ఏపీలో రిలీజ్ కాని లక్ష్మీస్ ఎన్టీఆర్
ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశించిన తర్వాత మహానాయకుడు జీవితంలో, తెలుగుదేశం పార్టీలో చోటుచేసుకొన్న సంఘటనల ఆధారంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రం మార్చి 29న రిలీజ్ అయింది. అయితే ఎన్నికల నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ కాకుండా ఏపీ హైకోర్టు స్టే విధించడం వివాదంగా మారింది.


Click it and Unblock the Notifications











