జగన్ హీరోగా వైయస్ జీవిత చరిత్ర???
ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రను సినిమాగా తీసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నామని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే రేపాల శ్రీనివాస్ తెలిపారు. ఈ సినిమాలో వైయస్ పాత్రను ఆయన కుమారుడు జగన్ పోషించేలా ప్రయత్నిస్తామని ఆయన అన్నారు. జగన్ పుట్టిన రోజును పురస్కరించుకొని మిర్యాలగూడలోని ఒక అనాథ శరణాలయంలోని విద్యార్థులకు పండ్లు, దుప్పట్లు, శాలువాలు అందజేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పై విషయం చెప్పారు. ప్రజలు మెచ్చిన ముఖ్యమంత్రిగా పేరుపొందిన రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా చేసుకుని సినిమా తీయాలనుకుంటున్నాం..దీనికి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే వెంటనే సినిమా షూటింగ్ మొదలవుతుంది...అన్నారు. నాడు-నేడు, ప్రజా పార్టీ కాంగ్రెస్, ప్రజల మనిషి వైయస్, రైతు రాజ్యం వంటి టెలి ఫిల్మ్ లు నిర్మించిన అనుభవం రేపాల శ్రీనివాస్ కు ఉంది.


Click it and Unblock the Notifications











