వైఎస్ జగన్ నా అన్న, నా రక్తం... అందరి నోరు మూయించిన మంచు విష్ణు భార్య!
టాలీవుడ్ డైలాగ్ కింగ్, సీనియర్ స్టార్ మంచు మోహన్ బాబు శ్రీవిద్యానికేతన్ విద్యార్థులకు చంద్రబాబు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజురీఎంబర్స్మెంట్ బకాయిల కోసం తిరుపతిలో ఇటీవల నిర్వహించిన నిరసన ర్యాలీ రాజకీయ రంగు పులుముకుంది. ఎన్నికల వేళ చంద్రబాబు ప్రభుత్వానికి నష్టం కలిగించడంలో భాగంగానే మంచు ఫ్యామిలీ ఈ ర్యాలీ చేసినట్ల టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
కొందరు టీడీపీ శ్రేణులు మరో అడుగు ముందుకు వేసి... మంచు విష్ణు వైఎస్ఆర్ కుటుంబానికి చెందిన అమ్మాయిని పెళ్లాడారు, వారికి బంధుత్వం ఉండటం వల్లే జగన్‌ను గెలిపించేందుకు సహాయపడటంలో భాగంగా ఈ ర్యాలీ తీసినట్లు ఆరోపణలు గుప్పించారు.
ఈ పరిణామాల నేపథ్యంలో మంచు విష్ణు భార్య విరానికా మంచు చేసిన ట్వీట్ హట్ టాపిక్ అయింది.

వైఎస్ జగన్ నా అన్న, నా రక్తం...
‘‘వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అంటూ నన్ను కొందరు ప్రశ్నిస్తున్నారు. ఎందుకు చేయకూడదు? వైఎస్ జగన్ నా అన్నయ్య, నా రక్తం. కానీ నా వరకు నా కుటుంబం మొదటి ప్రాధాన్యత.'' అని ట్వీట్ చేయడం ద్వారా విరానికా మంచు విమర్శకుల నోరు మూయించే ప్రయత్నం చేశారు.

అప్నా టైమ్ ఆగయా...
అప్నా టైమ్ ఆగయా... అంటూ వైఎస్ జగన్‌కు సంబంధించిన వీడియో ఒకటి విరానికా మంచు షేర్ చేశారు. ఆమె ట్వీట్స్ చూస్తుంటే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని ఆమె బలంగా కోరుకుంటున్నట్లు స్పష్టమవుతోంది.
పదేళ్లు పూర్తి
మంచు విష్ణు-విరానికా వివాహం జరిగిన 10 సంవత్సరాలు పూర్తయింది. ఇటీవల తమ పెళ్లి రోజు సందర్భంగా ఆసక్తికర ట్వీట్ చేశారు. మా పెళ్లి జరిగిన పదేళ్లు, 120 నెలలు, 522 వారాలు, 3652 రోజులు, 87,658 గంటలు, 5,259,000 నిమిషాలు పూర్తయ్యాయి అంటూ వ్యాఖ్యానించారు.

వైఎస్ జగన్, భారతితో విరానికా మంచు
ఇటీవల అమరావతిలో జరిగిన గృహ ప్రవేశ కార్యక్రమంలో వైఎస్ జగన్, భారతితో కలిసి వెరోనికా మంచు.


Click it and Unblock the Notifications











