రక్త చరిత్రలో వైయస్ జగన్!?

వర్మ మాట్లాడుతూ పరిటాల రవి జీవితానికి సంబంధించిన చాలా సమాచారం సేకరించాను. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడాను. ప్రభాకరన్, దావూద్ ఇబ్రహీమ్ లాంటి వాళ్ల జీవితాల్ని గతంలో పరిశీలించాను. కానీ వారందరితో పోలిస్తే భిన్నమైన చరిత్ర పరిటాల రవిది. ఆయన్ను రక్తసిక్తమైన ఫ్యాక్షన్ వైపు నడిపించిన పరిస్థితులు...ఆ పరిస్థితులే ఆయన్ను తుదముట్టించేందుకు ఎలా తోడ్పడ్డాయి అనే కోణంలో రెండు భాగాలుగా ఈ కథలు సాగుతాయి. ఇంతవరకూ ఏ రచయితకూ దొరకని అరుదైన కథ ఇది.
నా కెరీర్‌లో ఓ మైలురాయిగా మిగులుతుంది. నేనేదో అద్భుతంగా ఈ చిత్రాల్ని తెరకెక్కిస్తానని ఈ మాట చెప్పట్లేదు. ఆయన జీవితం అలాంటిది. దమ్మున్న కథ దొరికిందన్న విషయాన్ని ఈ రకంగా చెబుతున్నాను. చిన్నతనంలో నెమ్మదస్తుడిగా, సిగ్గరిగా ఉన్న పరిటాల రవి తన సోదరుడు, తండ్రి మరణానంతరం ఫ్యాక్షన్ వైపు మరలిన తీరు, ఆ తరవాత జరిగిన సంఘటనలన్నీ వెండితెరపై ఆవిష్కరిస్తానని చెప్పారు.
రక్తచరిత్ర సినిమాకు మద్దెలచెర్వు సూరి పెట్టుబడి పెడుతున్నారనే వార్తలను ఆయన ఖండించారు. సినిమా మొత్తం రాయలసీమ జిల్లాల్లోనే షూటింగ్ జరుపుకుంటుందని ఆయన చెప్పారు. అయిదు గంటల నిడివితో రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తానని వర్మ ప్రకటించారు. మొదటి భాగం వచ్చే జనవరిలోనూ, రెండో భాగం ఏప్రిల్‌లోనూ విడుదల చేస్తారు. ఇక ఈ చిత్రాన్ని తెలుగులో 'రక్త చరిత్ర' పేరుతో విడుదల చేసే అంశమై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పరిటాల రవి జీవితంతో తీసే సినిమా కాబట్టి కచ్చితంగా తెలుగులో కూడా తీసుకొచ్చే అవకాశాలున్నాయి.
ఈ సందర్భంగా జిమ్మి మాట్లాడుతూ తాను ఛీప్ మినిస్టర్ కుమారుడు పాత్రను ఈ సినిమాలో చేస్తున్నాను. లీడ్ క్యారెక్టర్ హత్యకు నాకు సంభంధం ఉందని నాపై వివాదం చెలరేగుతుంది. చాలా ఆసక్తిగా సాగే పాత్ర అది చాలా ఏంగ్జైటీగా చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











